TG Best Teacher Awards 2024 : వడ్డాణం శ్రీనివాస్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
Telangana Govt Best Teacher Awards 2024 : తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా యూనివర్శిటీల విభాగం నుంచి ప్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాస్ రావుకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కింది. ప్రస్తుతం ఆయన బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీలో కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
2024 సంవత్సరానికి గానూ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఇందులో యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పని చేస్తున్న వడ్డాణం శ్రీనివాస్ రావుకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. ఆయన సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్ గా ఉన్నారు.
ఫ్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాస్… డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఈఎంఆర్ అండ్ ఆర్సీ విభాగంతో పాటు సెంటర్ ఫర్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ విభాగానికి కూడా డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇయన సూర్యాపేట జిల్లా మద్దిరాల మద్దిరాల గ్రామానికి చెందినవారు.
పాఠశాల విద్యను స్వగ్రామంలోనే అభ్యసించారు. ఖమ్మంలో డిగ్రీని పూర్తి చేశారు. పీజీ నుంచి పీహెచ్ డీ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. ‘తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రసార మాధ్యమాల పాత్ర’ అనే టాపిక్ పై పీహెచ్డీ చేశారు. ప్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాస్ కు హిస్టరీ, ఎడ్యుకేషన్, ఫిలాసఫీ సబ్జెక్టుల్లో దాదాపు పాతిక సంవత్సరాల బోధన అనుభవం ఉంది.
సెప్టెంబర్ 5వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాసర్ రావు ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
సంబంధిత కథనం