యూపీఎస్సీ సివిల్స్-2024 తుది ఫలితాలను విడుదల చేసింది. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. శక్తి దుబే తొలి ర్యాంకుతో సత్తా చాటగా హర్షిత గోయల్ (2), అర్చిత్ పరాగ్ (3) సాధించారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇ.సాయి శివాని 11వ ర్యాంకు సాధించారు. బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్‌కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ 68, ఎన్.చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119, చల్లా పవన్ కల్యాణ్ 146, ఎన్.శ్రీకాంత్ రెడ్డి 151, నెల్లూరు సాయితేజ 154, కొలిపాక శ్రీకృష్ణసాయి 190, పోతురాజు హరిప్రసాద్‌కు 255వ ర్యాంకు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం వెయ్యికి పైగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి ప్రతిష్ఠాత్మక పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. గతేడాది జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఇందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. ఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఈ ఏడాది జనవరి 7 నుంచి ఏప్రిల్ 17వరకు దశల వారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. తాజాగా ఇవాళ సివిల్స్ తుది ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల్లో మొత్తం 1009 మందిని యూపీఎస్సీ సెలెక్ట్ చేసింది. వీరిలో జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 109, ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీలో 87మంది ఉన్నారు.
సంబంధిత కథనం