Medaram Unknown Facts | మేడారంలో వాళ్లు అర్ధరాత్రి అడవిలోకి ఎందుకు వెళ్తారు? సమ్మక్క ఏం చెబుతుంది?
మేడారం జాతరలో ప్రతిదీ విశేషమే. సమ్మక్క, సారలమ్మ చరిత్ర గురించి తెలుసుకుంటుంటే.. ఆసక్తికరమే. మేడారంలో జరిగే పూజ విధానం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. సమ్మక్క రావడానికి ముందురోజు పూజారులు, వడ్డేలు అడవిలోకి వెళ్తారు. అలా ఎందుకు అడవిలోకి వెళ్తారు? అక్కడ ఏం చేస్తారు?
మేడారాన్ని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు వస్తారు. సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గుడారాలు, పందిళ్లు, ఆరుబయట, వాగు ఒడ్డులో, స్థానిక ఇళ్లలో బస చేస్తూ అమ్మ చల్లని చూపు కోసం వేచిచూస్తారు. మెుదటి రోజు కన్నెపల్లి నుంచి జంపన్నవాగు మీదుగా సారలమ్మ మేడారం వస్తుంది. రెండో రోజు సమ్మక్క రాకకోసం భక్తులు ఎంతో ఎదురుచూస్తారు.
అయితే సారలమ్మ గద్దెల మీదకు రాగానే.. జాతరలో ఓ విధమైన ఎమోషన్ మెుదలవుతుంది. మరోవైపు.. సమ్మక్క పూజారులు, వడ్డేలు రహస్య పూజల కోసం మేడారం సమీపంలోని అడవికి వెళ్తారు. రెండేళ్లకోసారి.. జరిగే ఈ జాతర కోసం.. కంక వనం తెచ్చెందుకు వాళ్లు రహస్య ప్రాంతానికి వెళ్తారు. అక్కడకు ఎవరినీ రానివ్వరు. వడ్డేలు, పూజారులు, తలపతులు బుధవారం అర్ధరాత్రి అడవికి వెళ్తారు. సామాన్య భక్తులు, స్థానికులు, ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇలా ఎవరైనా సరే.. అసలు అనుమతించరు. వాళ్లు మాత్రమే వెళ్తారు. సమ్మక్కను గద్దెపై నిలబెట్టాలి. అందుకోసం.. కంక చెట్టు కోసం చూస్తారు. కంక చెట్టు వెతికేందుకు.. రహస్య పద్ధతిలో గంటలతరబడి పూజలు చేస్తారు.
అయితే ఈ పూజ కార్యక్రమం జరుగుతుండగానే.. సమ్మక్కను నుంచి ఆన వస్తుందని ఆదివాసులు చెబుతుంటారు. దాని ప్రకారమే.. ఓ కంక చెట్టును ఎంపిక చేస్తారు. అప్పటి నుంచి.. గురువారం తెల్లవారు జాము వరకు అడవిలోనే ఉంటారు. అప్పటి వరకు ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇలా అయిపోయిన తర్వాత.. చెట్టులో కొంత వెదురును నరుకుతారు.
అడవిలో నరికిన వెదురు బొంగులతో అక్కడ నుంచి బయలుదేరుతారు. తమ భుజాలపై మోస్తూ.. మేడారం తీసుకువస్తారు. మేడారానికి ప్రారంభంలో ఉన్న పోతారజు గుడి వద్ద వెదురు బొంగులకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం జాతర జరిగే ప్రదేశానికి వస్తారు. పూజల అనంతరం ఆ కంక వనాన్ని మేడారంలో సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత.. చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్క గద్దెల మీదకు చేరేందుకు సమయం ఆసన్నమైనట్టుగా అనుకుంటారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకురావడానికి పని మెుదలుపెడ్తారు.
చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణి రూపంలో అమ్మవానిరి తీసుకువస్తారు. అనంతరం రెండు రోజులపాటు భక్తులకు సమ్మక్క దర్శనం ఇస్తుంది. ఆ తర్వాత వన ప్రవేశం జరుగుతుంది. అయితే కంక బొంగులు మాత్రం.. అలానే ఉంచుతారు. వీటిని భక్తులు సమ్మక్కగా భావిస్తారు. దర్శించుకుని.. మెుక్కులు చెల్లిస్తారు. మళ్లీ జాతర వచ్చే వరకు ఈ కంక బొంగులు.. సమ్మక్క గద్దెపైనే ఉండటం విశేషం.
సంబంధిత కథనం
టాపిక్