Book Talk at HCU : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో 'బుక్ టాక్' ఈవెంట్ - జర్నలిస్ట్ ఉమేష్ ఉపాధ్యాయ్ రచించిన పుస్తకంపై చర్చ-university of hyderabad students club hosts insightful book talk with renowned journalist shri umesh upadhyay ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Book Talk At Hcu : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో 'బుక్ టాక్' ఈవెంట్ - జర్నలిస్ట్ ఉమేష్ ఉపాధ్యాయ్ రచించిన పుస్తకంపై చర్చ

Book Talk at HCU : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో 'బుక్ టాక్' ఈవెంట్ - జర్నలిస్ట్ ఉమేష్ ఉపాధ్యాయ్ రచించిన పుస్తకంపై చర్చ

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 13, 2024 06:37 PM IST

Book Talk in University of Hyderabad : హెచ్ సీయూ స్టూడెంట్ప్ క్లబ్ యంగ్ ఇండిక్ సోషల్ థింకర్స్ ఆధ్వర్యంలో… 'బుక్ టాక్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథిగా ప్రముఖ జర్నలిస్ట్, రచయిత శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ్ హాజరయ్యారు..

విద్యార్థులతో జర్నలిస్ట్, రచయిత ఉమేష్ ఉపాధ్యాయ్
విద్యార్థులతో జర్నలిస్ట్, రచయిత ఉమేష్ ఉపాధ్యాయ్

‘Book Talk’ in University of Hyderabad : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 'బుక్ టాక్' కార్యక్రమాన్ని నిర్వహించారు. HCU(University of Hyderabad) స్టూడెంట్ప్ క్లబ్ యంగ్ ఇండిక్ సోషల్ థింకర్స్ శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ జర్నలిస్ట్, రచయిత శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ్(Shri Umesh Upadhyay) హాజరయ్యారు. యూనివర్శిటీ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రముఖ జర్నలిస్ట్ ఉమేష్ ఉపాధ్యాయ్ రచించిన పుస్తకం
ప్రముఖ జర్నలిస్ట్ ఉమేష్ ఉపాధ్యాయ్ రచించిన పుస్తకం

ఈ కార్యక్రమం సందర్భంగా ఉమేష్ ఉపాధ్యాయ్ రచించిన తన తొలి పుస్తకాన్ని ( "Western Media Narratives on India - From Gandhi to Modi") సభ ముందు ప్రజెంట్ చేశారు. గాంధీ నుంచి మోదీ వరకు భారతదేశంపై పాశ్చాత్య దేశ మీడియా కథనాలు ఏ విధంగా ఉన్నాయని తన ప్రసంగంలో వివరించే ప్రయత్నం చేశారు. ఈ పుస్తకంలో రాసిన కొన్ని ముఖ్యమైన విషయాలను సభ ముందు ఉంచారు.

బుక్ ప్రెజెంటెషన్ తర్వాత.... ప్రశ్నోత్తరాల సెషన్ కొనసాగింది. ఈ సందర్భంగా... విద్యార్థులు పలు ప్రశ్నలను సంధించారు. ఇందుకు శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ్ తనదైన శైలిలో జవాబులు ఇచ్చారు. ఆయన రచించిన పుస్తకంలోని సారాంశాలను ఉదహరిస్తూ సమాధానాలు ఇచ్చారు. ప్రశ్న - జవాబులతో సాగిన ఈ కార్యక్రమంలో…. విద్యార్థులు, అధ్యాపకులు నిమ్మగ్నమైపోయారు.

IPL_Entry_Point

టాపిక్