Govt Jobs 2024 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - 42 ఖాళీలు, ముఖ్య వివరాలివే-university of hyderabad special recruitment drive for filling up of backlog reserved vacancies 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Govt Jobs 2024 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - 42 ఖాళీలు, ముఖ్య వివరాలివే

Govt Jobs 2024 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - 42 ఖాళీలు, ముఖ్య వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 13, 2024 04:59 PM IST

Hyderabad Central University Jobs : పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా… ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఖాళీలను రిక్రూట్ చేయనుంది. మొత్తం 42 ఖాళీలున్నాయి. దరఖాస్తులకు డిసెంబర్ 9వ తేదీని గడువుగా నిర్ణయించారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఖాళీలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఖాళీలు

టీచింగ్ పై ఆసక్తిగల వారికి గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్‌ సెంట్రల్ వర్శిటీ. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 42 బ్యాక్ లాగ్ ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా 21 అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

నవంబర్ 8వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా… డిసెంబర్ 9వ తేదీని గడువుగా నిర్ణయించారు.సైన్స్‌, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్‌, మేనేజ్‌మెంట్ స్టడీస్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్‌ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. https://uohyd.ac.in/teaching-guest-faculty/ లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - హైదరాబాద్‌ సెంట్రల్ వర్శిటీ.
  • ఉద్యోగాలు - టీచింగ్ ఖాళీలు
  • మొత్తం ఖాళీలు - 42(బ్యాక్ లాగ్)
  • ఖాళీల వివరాలు - ప్రొఫెసర్లు 20, అసోసియేట్ ప్రొఫెసర్లు 21, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 01 ఉద్యోగాలు ఉన్నాయి.
  • సబ్జెక్టుల వివరాలు - సైన్స్‌, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్‌, మేనేజ్‌మెంట్ స్టడీస్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
  • అర్హతలు - సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బోధన/ పరిశోధనానుభవం కలిగి ఉండాలి.
  • దరఖాస్తులు - ఆన్ లైన్ విధానం
  • దరఖాస్తు ఫీజు - రూ. 1000 చెల్లించాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు తుది గడువు -09 డిసెంబర్ 2024
  • ఆఫ్ లైన్ లో కూడా అప్లికేషన్లు పంపవచ్చు. ఇందుకు 16 డిసెంబర్ 2024వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
  • ఆఫ్‌లైన్ అప్లికేషన్లను ‘ ది అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్‌మెంట్ సెల్, రూమ్ నంబర్‌:- 221, మొదటి అంతస్తు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ప్రొఫెసర్, సి.ఆర్‌. రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్- 500 04’ చిరునామాకు పంపించాలి.
  • ఎంపిక విధానం - అకడామిక్స్ తో పాటు ఇంటర్వ్యూ, డెమో ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://uohyd.ac.in/
  • అప్లికేషన్ లింక్ - https://curec.samarth.ac.in/index.php/search/site/index
  • పూర్తి వివరాలను తెలుసుకునేందుకు https://uohyd.ac.in/careers-uoh /   వెబ్ సైట్ లోకి వెళ్లాలి. కింద ఇచ్చిన నోటిఫికేషన్ లో ఖాళీల వివరాలతో పాటు దరఖాస్తు విధానం గురించి తెలుసుకోవచ్చు…….

Whats_app_banner