HCU Recruitment 2023: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో టీచింగ్ ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వూనే -university of hyderabad issued recruitment notification for teaching jobs 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  University Of Hyderabad Issued Recruitment Notification For Teaching Jobs 2023

HCU Recruitment 2023: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో టీచింగ్ ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వూనే

HT Telugu Desk HT Telugu
Mar 15, 2023 02:06 PM IST

Hyderabad Central University: ఉద్యోగాల భర్తీకి సంబంధించి అప్డేట్ ఇచ్చింది హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ. పలు టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఉద్యోగాలు
హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఉద్యోగాలు

Hyderabad Central University Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్‌ సెంట్రల్ వర్శిటీ. పలు టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టును అనుసరించి బీఈడీ/ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే... ఇంటర్వూల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ కేటగిరిలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంపికైన వారు వర్శిటీ ప్రాంగణంలోని పాఠశాలలో పని చేయాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

ముఖ్య వివరాలు :

భర్తీ చేసే పోస్టులు - పీజీటీ , టీజీటీ, పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్)

ట్రైనీ గ్రాడ్యూయేట్ టీచర్ ఖాళీలు - 13

పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్ ఖాళీలు - 01

ప్రైమరీ టీచర్ -03

వయస్సు - దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 65 ఏళ్ల లోపు ఉండాలి.

జీతం - టీజీటీ వారికి నెలకు రూ. 45000, పీజీటీ వారికి - 48,000, ప్రైమరీ టీచర్ వారికి రూ. 35,000 చెల్లిస్తారు.

అర్హతలు - ఆయా పోస్టులను అనుసరించి డిగ్రీ, బీఈడీ, ఎంఎస్సీ ఉండాలి, సీటెట్ కూడా తప్పనిసరి.

ఎంపిక విధానం - ఇంటర్వూ ద్వారా చేపడుతారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 09 గంటలకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు వరకు ఇంటర్వూలు నిర్వహిస్తారు.

వేదిక - కాలేజీ ఆఫ్ ఇంటిగ్రేటెట్ స్టడీస్, సౌత్ క్యాంపస్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్.

అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వెరిఫికేషన్ ఉంటుంది.

ఎంపికైన వారు తక్షణమే విధుల్లో చేరాల్సి ఉంటుంది.

కేంద్రీయ విద్యాలయంలో పని చేసి రిటైర్ అయినవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు https://uohyd.ac.in/careers-uoh/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. కింద ఇచ్చిన నోటిఫికేషన్ లో ఖాళీల వివరాలు కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆయా సబ్జెక్టుల వివరాలను పేర్కొన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం