HCU Recruitment 2024 : నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నోటిఫికేషన్ - ఖాళీలు, ముఖ్య తేదీలివే-university of hyderabad issued non teaching posts recruitment 2024 for various jobs full details read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hcu Recruitment 2024 : నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నోటిఫికేషన్ - ఖాళీలు, ముఖ్య తేదీలివే

HCU Recruitment 2024 : నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నోటిఫికేషన్ - ఖాళీలు, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 06, 2024 01:29 PM IST

Hyderabad Central University Jobs : ఉద్యోగాల భర్తీకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది.

హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఉద్యోగాలు
హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఉద్యోగాలు

HCU Recruitment 2024 : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 52 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ దరఖాస్తులకు జులై 19వ తేదీని తుది గడువుగా ఉంది. https://uohyd.ac.in/careers-uoh/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు :

  • ఉద్యోగ ప్రకటన - యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌.
  • ఉద్యోగాలు - నాన్ టీచింగ్ పోస్టులు -
  • మొత్తం ఖాళీలు - 52(గ్రూప్ ఏ, బీ, సీ కేటగిరిలు ఉన్నాయి)
  • అర్హతలు - పోస్టును అనుసరించి అర్హతల నిర్ణయించారు. నోటిఫికేషన్ లో పూర్తి వివరాలను చూడొచ్చు. పని అనుభవం కూడా ఉండాలి.
  • వేతనం - పోస్టును బట్టి ఉంటుంది. గ్రూప్ ఏ పోస్టులకు భారీగా వేతనం ఉంది.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • అప్లికేషన్ ఫీజు - గ్రూప్‌ ఎ కేటగిరి పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1000 చెల్లించాలి. ఇక గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులకు రూ.500 చెల్లించాలి.
  • ఎంపిక విధానం - రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితా ప్రకటిస్తారు.
  • దరఖాస్తులకు చివరి తేదీ - 19 జులై 2024.
  • అప్లికేషన్ లింక్ - https://uohydnt.samarth.edu.in

టీజీపీఎస్సీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్….

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా….లీగల్ ఎక్స్‌పర్ట్, సీనియర్ కౌన్సెల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం కలిపి 4 ఉద్యోగాలు ఉన్నాయి.

ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. జులై 15వ తేదీలోపు అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వీటిని రిక్రూట్ చేస్తున్నట్లు పేర్కొంది. దరఖాస్తు ఫారమ్ ను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్య వివరాలు :

  • ఉద్యోగ ప్రకటన - తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైదరాబాద్.
  • మొత్తం ఖాళీలు - 04
  • ఖాళీల వివరాలు - లీగల్ ఎక్స్‌పర్ట్ - 03, సీనియర్ కౌన్సెల్‌ - 01 పోస్టు.
  • కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వీటిని రిక్రూట్ చేస్తున్నారు.
  • అర్హతలు - ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్‌ఎం ఉత్తీర్ణతతో ఉండాలి. మూడేళ్ల స్టాండింగ్ ఉండాలి. సర్వీస్ మ్యాటర్స్ లో పని అనుభవం తప్పనిసరి.
  • జీతం - నెలకు రూ.60,000.
  • దరఖాస్తు విధానం - ఆఫ్‌లైన్‌ లో సమర్పించాలి.
  • దరఖాస్తు లింక్ - https://websitenew.tspsc.gov.in/
  • పూర్తి చేసిన దరఖాస్తులను, ధ్రువపత్రాలతో సహా టీజీపీఎస్సీ, నాంపల్లి కార్యాలయంలో సమర్పించాలి.
  • దరఖాస్తుకు చివరి తేదీ - జులై 15, 2024.
  • ఏమైనా సందేహాలు ఉంటే 7288896631 ఫోన్ నెంబర్( ఎస్, సత్యనారాయణ, అసిస్టెంట్ సెక్రటరీ ) ను సంప్రదించవచ్చు.

మరోవైపు తెలంగాణ‌ ప్రభుత్వం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. వైద్యారోగ్య శాఖలో 435 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల భ‌ర్తీకి మెడిక‌ల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. జులై 2వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జులై 11వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

WhatsApp channel