Beers Supply Stopped : మందుబాబులకు షాకింగ్ న్యూస్- కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల సరఫరా నిలిపివేత
Beers Supply Stopped : మందుబాబులకు షాకింగ్ న్యూస్ చెప్పింది కింగ్‌ఫిషర్ బీర్ తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్. తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
rs Supply Stopped : మందుబాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లను తెలంగాణలో సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. పాత బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్‌లోని రెగ్యులేషన్ 30కి అనుగుణంగా... తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీబీసీఎల్) కి తన బీర్ల సరఫరాను తక్షణమే నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించిందింది.
టీజీబీసీఎల్...తన కంపెనీ బీర్ ప్రాథమిక ధరను 2019-20 నుంచి సవరించలేదని తెలిపింది. దీని ఫలితంగా తెలంగాణలో భారీ నష్టాలు చవిచూశామని పేర్కొంది. దీంతో పాటు గతంలో సరఫరా చేసిన బీర్లకు టీజీబీసీఎల్ చెల్లించాల్సిన బకాయిలు భారీగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ కారణాలతో తెలంగాణలో తమ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
గత బకాయిలు, ధరల పెరుగుదలతో...తమ కంపెనీ వస్తున్న నష్టాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తెలంగాణ నుంచి రావాల్సిన గత రెండు త్రైమాసిక బకాయిలు రూ. 900 కోట్లు అని యూబీఎల్ పేర్కొంది. పండుగ సీజన్, మరో త్రైమాసిక అమ్మకాలతో తెలంగాణ నుంచి రూ.1000 కోట్లకు పైగా బకాయిలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరో రెండు నెలల్లో వేసవి కాలం ప్రారంభం కానుంది. వేసవిలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ తీసుకున్న నిర్ణయం కేఎఫ్ బీర్ ప్రియులకు షాకింగ్ గా ఉంది. వేసవి కాలంలో కేఎఫ్ బీర్లకు బాగా డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు మద్యం షాపుల్లో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో లేవని చెబుతున్నారు. కింగ్ ఫిషర్ బదులుగా తుబర్గ్ లైట్ బీర్లను విక్రయిస్తున్నారు.
ఒకటి రెండు రోజుల్లో మిగిలిన కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ కూడా అయిపోయే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయం తెలిసిన మందు బాబులు ఉన్న కేఎఫ్ బీర్లు తెచ్చుకునేందుకు మందుషాపులకు క్యూకడుతున్నారు. మరికొందరు ఇతర బ్రాండ్ల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొంత మంది తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పెండింగ్ బిల్లులను చెల్లించి, కేఎఫ్ బీర్ల సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు. పెండింగ్ బీర్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోతే కేఎఫ్ బీర్ అందుబాటులో ఉండకపోవచ్చు.
సంబంధిత కథనం