Bandi Sanjay : పవన్‌కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించారు : బండి సంజయ్
Bandi Sanjay : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన కామెంట్స్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. పవన్‌కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యామ్ కామెంట్స్‌పై.. కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. పవన్‌కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించారని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలని పక్కదారి పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. అల్లు అర్జున్, రేవంత్‌కి ఎక్కడ చెడిందోనని వ్యాఖ్యానించారు. పుష్ప-3 రిలీజ్‌కు ముందే.. అల్లు అర్జున్‌కి రేవంత్‌రెడ్డి సినిమా చూపించారని అన్నారు.
కమీషన్లకు అడ్డాగా..
'14శాతం కమీషన్ దగ్గర చెడిందేమో. ముగ్గురు మంత్రులు కమీషన్లు వసూలు చేస్తున్నారు. సచివాలయం, మంత్రుల పేషీలు కమీషన్లకు అడ్డాగా మారాయి. ఇక్కడి కమీషన్లతో ఢిల్లీకి కప్పం కడుతున్నారు. మంత్రులందరికీ సీఎం కావాలని ఉంది. ఢిల్లీకి డబ్బులు పంపడం వల్లే సీఎం పదవి నిలబడుతోంది' అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
పవన్ ఏమన్నారు..
'అల్లు అర్జున్ వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తెచ్చారు. రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్. వైసీపీ ప్రభుత్వంలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు. బెనిఫిట్ షోలు అధిక ధరలు ఉనప్పుడు కలెక్షన్స్ వస్తాయి. సలార్, పుష్పా సినిమాలకు అందుకే రికార్డ్ కలెక్షన్లు వచ్చాయి. అంచనాలు ఎక్కువగా ఉన్న సినిమాలకు ఫాన్స్ ఎక్కువగా వస్తారు. సినిమా థియేటర్లకు హీరోస్ వెళ్లడం వల్ల ఇబ్బందులు వస్తాయి. నేను మొదట్లో మూడు సినిమాలకి వెళ్లి పరిస్థితి అర్థం చేసుకుని ఆగిపోయాను' అని పవన్ కల్యాణ్ వివరించారు.
చాలా బాధాకరం..
'అల్లు అర్జున్‌కు స్టాఫ్ చెప్పి ఉండాల్సింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్‌గా వెళ్లి ఉంటే బాగుండేది. చనిపోవడం చాలా బాధాకరం. ఘటన జరగ్గానే సినిమా హీరో లేదా నిర్మాతలు లేక దర్శకుడు వాళ్ల ఇంటికి వెళ్లి సపోర్ట్ ఇవ్వాల్సింది. మీ బాధలో మేమున్నాము అని భరోసా ఇవ్వాల్సింది. అల్లు అర్జున్ వెళ్లడం కుదరకపోయినా.. మిగిలిన వాళ్లు వెళ్లాల్సింది. అలా వెళ్లకపోవడం పొగరు అనుకుంటారు. ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి మద్దతు ఉండాలి' అని పవన్ అభిప్రాయపడ్డారు.
రేవంత్ బాగా ప్రోత్సహించారు..
'రేవంత్ రెడ్డి సినిమా రంగాన్ని బానే ప్రోత్సహించారు. బెనిఫిట్ షో అధిక ధరలకు అనుమతి ఇచ్చారు కదా. రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అలా చేశారని అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డి అలాంటి వాటినన్నింటినీ మించిన నాయకుడు. రేవంత్ రెడ్డి నాకు చాలా కాలంగా తెలుసు. వన్స్ కేసు నమోదు అయ్యాక చట్ట ప్రకారం జరిగిపోయింది. రేవంత్ రెడ్డిని తప్పు బట్టలేము. ఆస్థానంలో ఎవరున్నా చట్ట ప్రకారం ఫాలో అవుతారు. లాలూచీ పడితే మీడియా, ప్రజలు తిట్టారా. అది పెద్ద డిఫికల్ట్ సిచ్యుయేషన్' అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.