Mudigonda Accident: ఖమ్మం జిల్లా ముదిగొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ జాతీయ రహదారిపై గ్రానైట్ రాళ్ల లోడుతో వెళుతున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో గ్రానైట్ రాళ్ల లోడుతో సహా రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వీరన్న, హుస్సేన్ అనే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.
గ్రానైట్ రాళ్ల లోడుతో నేలకొండపల్లి మండలంలోని ఖానాపురం వెళ్తుండగా డీసీఎం వాహనం యాక్సిల్ విరిగిపోయింది. దీంతో నియంత్రణ కోల్పోయిన లారీ రోడ్డుపై బోల్తా పడింది. గ్రానైట్ రాళ్ల లోడ్‌ను గమ్య స్థానం వద్ద అన్‌లోడ్ చేసేందుకు అందులో ప్రయాణిస్తున్న కార్మికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.
ప్రమాద సమయంలో డీసీఎంలో డ్రైవర్‌తో పాటు తొమ్మిది మంది గ్రానైట్ కార్మికులు ఉన్నారు. ఇద్దరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో కోదాడ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
సంబంధిత కథనం