TSWRLC Faculty Jobs: గెస్ట్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. నెలకు 50 వేల జీతం - అర్హతలివే-tswr law college invites applications for guest faculty vacancies in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tswr Law College Invites Applications For Guest Faculty Vacancies In Hyderabad

TSWRLC Faculty Jobs: గెస్ట్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. నెలకు 50 వేల జీతం - అర్హతలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 07, 2023 04:06 PM IST

TSWRLC Latest Updates: ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంస్థ. మహిళా లా కాలేజీలో గెస్ట్ ఫ్యాక్టలీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.

లా కాలేజీలో ఉద్యోగాలు
లా కాలేజీలో ఉద్యోగాలు

Telangana Social Welfare Residential Law College: లా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ , అసోసియేట్ ఫ్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఉన్న మహిళా లా కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. అర్హతతో పాటు అనుభవం ఉన్న మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లా ఆఫ్ ప్రాపర్టీ, కార్పొరేట్ లా, jurisprudence, క్రిమినల్ లా, కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా, ఫ్యామిలీ లా-II, కాన్‌స్టిట్యూషన్ లా-II, లా ఆఫ్ టార్ట్స్ కు సంబంధించి ఖాళీలు ఉన్నాయి. బీఏ ఐదు సంవత్సరాల (LLB) విద్యార్థులకు బోధించాల్సి ఉంటుంది.

నెట్ / సెట్/ పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. నెలకు 32,500 - 40,000 వరకు జీతం చెల్లిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు prl-rdcw-lbngr-swrs@telangana.gov.in కు ఈ- మెయిల్ చేయాలి. మరిన్ని వివరాలకు 9603617134 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

ఫ్లూలో 97 నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు

Hyderabad EFLU Recruitment 2023 : హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న .. 97 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ చేయనుంది. ఈ మేరకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఒక్కో పోస్టుకు సంబంధించి పలు అర్హతలను నిర్ణయించింది. ఇందులో గ్రూప్ ఎ, గ్రూప్ బి, గ్రూప్ - సి కేటగిరి పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 26, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. www.efluniversity.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవాలి.

గ్రూప్-ఎ పోస్టులు

1. డిప్యూటీ రిజిస్ట్రార్- 01

2. అసిస్టెంట్ రిజిస్ట్రార్- 04

3. హిందీ ఆఫీసర్‌- 01

4. డిప్యూటీ లైబ్రేరియన్- 02

5. అసిస్టెంట్ లైబ్రేరియన్- 05

6. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- 01

గ్రూప్- బి పోస్టులు:

1. సెక్షన్ ఆఫీసర్- 01

2. అసిస్టెంట్- 07

3. పర్సనల్ అసిస్టెంట్- 06

4. ప్రొఫెషనల్ అసిస్టెంట్- 01

5. అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)- 01

6. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 01

7. సెక్యూరిటీ ఆఫీసర్- 01

8. ప్రైవేట్ సెక్రటరీ (ప్రొ-వీసీ)- 01

9. హిందీ ట్రాన్స్‌లేటర్‌- 01

10. స్టాటిస్టికల్ అసిస్టెంట్- 01

గ్రూప్-సి పోస్టులు:

1. అప్పర్ డివిజన్ క్లర్క్- 07

2. సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 02

3. లోయర్ డివిజన్ క్లర్క్- 56

4. హిందీ టైపిస్ట్- 01

5. డ్రైవర్ (షిల్లాంగ్ క్యాంపస్)- 01

6. కుక్- 01

7. ఎంటీఎస్‌- 29

మొత్తం పోస్టుల సంఖ్య - 97

అర్హతలు - పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తుల తుది గడువు: 26 - జూన్- 2023.

అధికారిక వెబ్ సైట్ - www.efluniversity.ac.in 

WhatsApp channel