TSSPDCL Recruitment Results: జేఎల్‌ఎం, ఏఈ ఫలితాలు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే-tsspdcl jlm and ae results out check full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tsspdcl Jlm And Ae Results Out Check Full Details Are Here

TSSPDCL Recruitment Results: జేఎల్‌ఎం, ఏఈ ఫలితాలు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
May 27, 2023 12:41 PM IST

TSSPDCL JLM and AE Recruitment: JLM మరియు AE పోస్టుల భర్తీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది టీఎస్‌ఎస్పీడీసీఎల్‌. ఈ మేరకు ఫలితాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఫలితాలు
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఫలితాలు

TSSPDCL Latest Updates: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఓవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త తేదీలు ప్రకటిస్తుండగా.. మరోవైపు పలు శాఖలు నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలవుతున్నాయి. తాజాగా ఉద్యోగ అభ్యర్థులకు టీఎస్​ఎస్​పీడీసీఎల్ కీలక అలర్ట్ ఇచ్చింది. ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించిన జేఎల్ఎం, ఏఈ రాత పరీక్షల ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

ట్రెండింగ్ వార్తలు

NOTE: ఈ లింక్ పై క్లిక్ చేసి మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు

మొత్తం 1601 ఉద్యోగాలు భర్తీకి టీఎస్​ఎస్​పీడీసీఎల్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 1,553 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం), 48 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఎలక్ట్రికల్‌) పోస్టులు ఉన్నాయి. https://tssouthernpower.cgg.gov.in వెబ్ సైట్ సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

గతంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రద్దు అయిన సంగతి తెలిసింజే. ఈ రాత పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు, ఇతరులు డబ్బులు వసూలు చేసి కొంత మంది అభ్యర్థులకు సమాధానాలు చేరవేశారని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఫలితంగా ఆ నోటిఫికేషన్ ను రద్దు చేసింది విద్యుత్ పంపిణీ సంస్థ. ఈ పోస్టులకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటన విడుదల చేసి.. ఏప్రిల్ 30వ తేదీన పరీక్షలు నిర్వహించింది.

IPL_Entry_Point