TSRTC Dynamic Pricing : టీఎస్ఆర్టీసీ మరో నిర్ణయం.. ఇక డైనమిక్ ప్రైసింగ్ విధానం
TSRTC Dynamic Pricing : టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లో డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని తీసుకురానుంది.
రైల్వేలు, విమాన ప్రయాణాలలో ఉన్న ట్రెండ్‌ల నుండి ప్రేరణ పొందిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మార్చి 27 నుండి తమ టిక్కెట్ ధరలను మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం డైనమిక్ టికెటింగ్(Dynamci Ticketing) విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ బెంగళూరు రూట్‌లో నడుస్తున్న 46 సర్వీసులలో నిర్వహించబడుతుంది. డిమాండ్ ను బట్టి అసలు ధరలో 20 నుంచి 30 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్(VC Sajjanar) మాట్లాడుతూ.. ప్రయాణికులకు మేలు చేసేలా ఈ కార్యక్రమాలు చేపట్టామని, వారికి సేవ చేయడమే కార్పొరేషన్ ధ్యేయమన్నారు. డైనమిక్ ప్రైసింగ్(Dynamci Pricing) సిస్టమ్ ఆక్యుపెన్సీ, ట్రాఫిక్, డిమాండ్ వంటి పారామితులపై ఆధారపడి ఉంటుందని వారు చెప్పారు.
టిక్కెట్‌లు డిమాండ్‌కు అనుగుణంగా ధర నిర్ణయిస్తారు. తక్కువ లేదా ఎక్కువగా ఉంటాయి. బాగా నెట్‌వర్క్ చేయబడిన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా ఇది పనిచేస్తుంది. ప్రైవేట్ ఆపరేటర్లు సాధారణ రోజులలో కూడా విపరీతంగా వసూలు చేస్తారని, సీజనల్ డిమాండ్‌ను మరింత పెంచడం ద్వారా ధరలను క్యాష్ చేసుకుంటున్నారని వారు చెప్పారు.
'ప్రైవేట్ ఆపరేటర్లతో పోల్చినప్పుడు సరసమైన, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రయాణాన్ని అందించడానికి ఆన్‌లైన్ బుకింగ్(Online Booking)లో డైనమిక్ ప్రైసింగ్ స్ట్రక్చర్‌ను ప్రవేశపెట్టాలని మేం నిర్ణయించుకున్నాం.' అని చెప్పారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసుల్లో మెుదట ఈ డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తారు.
ప్రస్తుతం విమానాలు హోటళ్లు, ప్రైవేట్ బస్ ఆపరేటర్ల బుకింగ్స్ లో ఇప్పటికే ఈ డైనమిక్ ప్రైసింగ్ విధానం(Dynamci Pricing System) అమలులో ఉంది. ప్రయాణికుల రద్దీ ఆధారంగా టికెట్ ధరల్లో హెచ్చు లేదా తగ్గులు ఉంటాయి. ఇదే డైనమిక్ ప్రైసింగ్ విధానం. రద్దీ తక్కువగా ఉంటే సాధారణ ఛార్జీ కంటే తక్కువగా ఈ విధానంలో టికెట్ ధర అందుబాటులో ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ మేరకు ఎక్కువ రేట్లు కూడా ఉంటాయి. ప్రైవేట్ ఆపరేటర్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల(RTC Bus) బుకింగ్‌లతో పోల్చి టికెట్ ధర నిర్ణయించడం జరగుతుంది.
టాపిక్