TG JL Selection List 2024 : తెలంగాణ జూనియర్ లెక్చరర్ల ప్రొవిజినల్ లిస్ట్ విడుదల
TG JL Selection List 2024 : జూనియర్ లెక్చరర్ల ప్రొవిజినల్ లిస్ట్ ను టీజీపీఎస్సీ ప్రకటించింది. కెమిస్ట్రీ, హిస్టరీ, సంస్కృతం, ఫిజిక్స్ సబ్జెక్టుల వారీగా జేఎల్ లిస్ట్ ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది.
జూనియర్ లెక్చరర్ల ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. కెమిస్ట్రీ, హిస్టరీ, సంస్కృతం, ఫిజిక్స్ సబ్జెక్టుల వారీగా జేఎల్ లిస్ట్ ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో విడుదల చేశారు. రాష్ట్రంలోని మొత్తం 1392 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవ్వగా, సెప్టెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించారు.
తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022లో నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022 డిసెంబరు 16 నుంచి జనవరి 6, 2023 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరించారు. 2023 సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు రాత పరీక్షలు నిర్వహించారు. మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. తాజాగా జేఎల్ ప్రొవిజినల్ ఎంపిక జాబితాను విడుదల చేశారు.
జేఎల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు టీజీపీఎస్సీ మొత్తం 2724 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. జనరల్ కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయగా, పీడబ్ల్యూడీ కోటా కింద 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో మొత్తం 1392 జేఎల్ పోస్టుల భర్తీకి 2724 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి సెప్టెంబరు 11 వరకు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు.
ముగిసిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో 67.17శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రకటించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో మొత్తం ఏడు పేపర్లకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన పరీక్షలు ఆదివారం 27వ తేదీతో ముగిశాయి. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 31,403 మంది అర్హత పొందారు. వీరిలో హైకోర్టు అనుమతితో పరీక్షలకు హాజరైన 20 మంది స్పోర్ట్స్ క్యాటగిరీ అభ్యర్థులు కూడా ఉన్నారు.
సంబంధిత కథనం