TSPSC JL Answer Key : జూనియర్ లెక్చరర్ ప్రిలిమినరీ 'కీ' - ఇలా చెక్ చేసుకోండి
TSPSC Junior Lecturer Key 2023 : జూనియర్ లెక్చరర్ పరీక్షల ప్రిలిమినరీ కీ కి సంబంధించింది ప్రకటన చేసింది టీఎస్పీఎస్పీ. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని… ఈ నెల 25 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు తెలిపింది.
TSPSC Junior Lecturer Key 2023 : ఉద్యోగాల భర్తీ రాత పరీక్షల విషయంలో స్పీడ్ పెంచింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓవైపు పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాలపై కూడా దృషి పెడుతోంది. ఇటీవలే పలు సబ్జెక్టులకు సంబంధించి జేఎల్ రాత పరీక్షలు ముగిశాయి. పూర్తి అయిన ఎగ్జామ్స్ ప్రాథమిక కీ లను విడుదల చేయనుంది టీఎస్పీఎస్సీ. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు https://www.tspsc.gov.in ద్వారా కీ లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

తెలంగాణలో 1,392 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 9న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. నియామక రాత పరీక్షలు సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమయ్యాయి. సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ ) విధానంలో జరిగుతున్న ఈ పరీక్షలు అక్టోబర్ 3వ తేదీతో పూర్తి అవుతాయి. మొత్తం 11 రోజులపాటు ఆయా తేదీల్లో 16 సబ్జెక్టుల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే పలు సబ్జెకుల పరీక్షలు పూర్తి కాగా… ప్రిలిమినరీ కీలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 12వ తేదీన జరిగిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ పేపర్-1, ఇంగ్లీష్ పేపర్-2, 13వ తేదీన జరిగిన జరిగిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ పేపర్-1, బోటనీ/ఎకనమిక్స్ పేపర్-2 కీ లు అందుబాటులోకి వచ్చాయి. ఇక 14వ తేదీన జరిగిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ పేపర్-1, మేథమెటిక్స్ పేపర్-2 పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీలను కమిషన్ శనివారం వెబ్ సైట్ లో ఉంచనుంది. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 25 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది.
డౌన్లోడ్ ఇలా చేసుకోండి...
-అభ్యర్థులు మొదటగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లండి.
- Junior Lecturer Preliminary Key అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- డౌన్లోడ్ పీడీఎఫ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీని పొందవచ్చు.
-అభ్యంతరాలకు సంబంధించి Ojections అనే కాలమ్ ఉంటుంది. నిర్ణీత నమూనాలో అభ్యంతరాలను పంపాల్సి ఉంటుంది.
టీఎస్పీఎస్సీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్(JL Jobs) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి జేఎల్ పోస్టుల నోటిఫికేషన్ ఇది. చివరిగా ఉమ్మడి ఏపీలో 2008లో నోటిఫికేషన్ జారీ అయింది. అనేక కారణాలతో ఈ పోస్టులను 2012లో భర్తీ చేశారు. అప్పుడు తెలంగాణలో సుమారు 457 జేఎల్ పోస్టులను భర్తీ చేశారు. ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇటీవల జేఎల్ నోటిఫికేషన్ విడుదలైంది. పేపర్ లీకేజీ కారణంగా జేఎల్ పరీక్షలు ఆలస్యం అయ్యాయి.