TSPSC Junior Lecturer Hall Tickets : ఈనెల 12 నుంచి జేఎల్ ఉద్యోగ పరీక్షలు - హాల్ టికెట్లు విడుదల, లింక్ ఇదే
TSPSC Junior Lecturer Hall Tickets: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల నియామకానికి సంబంధించి టీఎస్పీఎస్సీ అలర్ట్ ఇచ్చింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
TSPSC Junior Lecturer Hall Tickets 2023 : పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన పరీక్షల విషయంలో వేగం పెంచింది తెలంగాణ పబ్లిక్ సర్వీక్ కమిషన్. ఇప్పటికే పలు పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించగా... కొన్నింటిని ఇప్పిటికే పూర్తి చేసింది. మరికొన్నింటిని నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.…ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల నియామకానికి సంబంధించిన రాత పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తేదీలు ఖరారు కాగా… తాజాగా హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ .
జేఎల్ నియామక రాత పరీక్షలు సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ ) విధానంలో జరిగే ఈ పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ వరకు జరగనున్నట్లు పేర్కొంది.మొత్తం 11 రోజులపాటు ఆయా తేదీల్లో 16 సబ్జెక్టుల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. వారం రోజుల ముందు నుంచే హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఒక అభ్యర్థి రెండు మూడు సబ్జెక్టులకు దరఖాస్తు చేసినా.. సబ్జెక్టు వారీగా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేసింది. మోడల్ పరీక్షలు రాసేందుకు వీలుగా లింక్ కూడా కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్లను పొందాలని సూచించింది. టీఎస్పీఎస్పీ ఐడీతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి… హాల్ టికెట్లు పొందవచ్చని వెల్లడించింది.
డౌన్లోడ్ ప్రాసెస్...
-అభ్యర్థులు మొదటగా https://www.tspsc.gov.in / వెబ్ సైట్ లోకి వెళ్లండి.
-డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ Junior Lecturer అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
-మీ టీఎస్పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
-డౌన్లోడ్ పీడీఎఫ్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
-ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
-ఉద్యోగ నియామక ప్రక్రియలో హాల్ టికెట్ కీలకం. భవిష్యత్తు అవసరాల కోసం భద్రంగా ఉంచుకోవాలి.
ఈ సెప్టెంబర్ మాసంలో జరిగే పరీక్షల షెడ్యూల్‌ను శనివారం విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం చూస్తే… ఈ నెలంతా కూడా పరీక్షలు ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన షెడ్యూల ప్రకారం చూస్తే… పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను ఈ నెల 4, 5, 6, 8వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి ఈ నెల 11వ తేదీన ఎగ్జామ్ ఉంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 12, 13, 14, 20, 21, 22, 25, 26, 27,29వ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.