TSPSC JL Hall Tickets : జేఎల్ అభ్యర్థులకు అలర్ట్... ఈ సబ్జెకుల హాల్‌ టికెట్లు విడుదల, లింక్ ఇదే-tspsc jl hall tickets available at tspscgovin ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Jl Hall Tickets : జేఎల్ అభ్యర్థులకు అలర్ట్... ఈ సబ్జెకుల హాల్‌ టికెట్లు విడుదల, లింక్ ఇదే

TSPSC JL Hall Tickets : జేఎల్ అభ్యర్థులకు అలర్ట్... ఈ సబ్జెకుల హాల్‌ టికెట్లు విడుదల, లింక్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 22, 2023 09:10 PM IST

TSPSC Junior Lecturer Hall Ticket 2023: జేఎల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరికొన్ని సబ్జెక్టుల హాల్ టికెట్లు వచ్చేశాయ్. https://www.tspsc.gov.in లింక్ తో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

జేఎల్ హాల్ టికెట్లు
జేఎల్ హాల్ టికెట్లు

TSPSC Junior Lecturer Hall Tickets 2023 : జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో అప్డేట్ ఇచ్చింది టీఎస్పీఎస్సీ. పలు సబ్జెక్టుల రాత పరీక్ష హాల్ టిెకెట్లను కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు https://www.tspsc.gov.in నుంచి హాల్‌ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ నెల 29న జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌, హిస్టరీ, సంస్కృతం అభ్యర్థులకు ఎగ్జామ్ ఉంది. అక్టోబర్‌ 3వ తేదీన జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌, ఉర్దూ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు… మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. జేఎల్ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 1,392 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

డౌన్లోడ్ ఇలా చేసుకోండి...

-అభ్యర్థులు మొదటగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లండి.

- Junior Lecturer Hall Ticket - 22/2022 అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

- TSPSC ID, పుట్టిన తేదీతో పాటు అక్కడ ఉండే captchaని ఎంట్రీ చేయాలి.

- డౌన్లోడ్ పీడీఎఫ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

- ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ పొందవచ్చు.

జేఎల్ నియామక రాత పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి ప్రారంభమయ్యాయి. సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ ) విధానంలో జరిగుతున్న ఈ పరీక్షలు అక్టోబర్‌ 3వ తేదీతో పూర్తి అవుతాయి. మొత్తం 11 రోజులపాటు ఆయా తేదీల్లో 16 సబ్జెక్టుల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఎగ్జామ్ జరిగే వారం రోజుల నుంచి హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొస్తుంది టీఎస్పీఎస్సీ. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తి కాగా…. శుక్రవారం మరికొన్ని సబ్జెక్టుల హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో వృక్షశాస్త్రం, ఆర్థికశాస్త్రం, ఇంగ్లీష్ అభ్యర్థులకు సంబంధించి ప్రాథమిక కీ లను కూడా ప్రకటించింది టీఎస్పీఎస్సీ.

టీఎస్పీఎస్సీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్(JL Jobs) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1392 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి జేఎల్‌ పోస్టుల నోటిఫికేషన్‌ ఇది. చివరిగా ఉమ్మడి ఏపీలో 2008లో నోటిఫికేషన్‌ జారీ అయింది. అనేక కారణాలతో ఈ పోస్టులను 2012లో భర్తీ చేశారు. అప్పుడు తెలంగాణలో సుమారు 457 జేఎల్‌ పోస్టులను భర్తీ చేశారు. ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇటీవల జేఎల్ నోటిఫికేషన్ విడుదలైంది. పేపర్ లీకేజీ కారణంగా జేఎల్ పరీక్షలు ఆలస్యం అయ్యాయి.

సంబంధిత కథనం