Group 3 Jobs: గ్రూపు-3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? సిలబస్ ఇదే..!-tspsc group 3 exam pattern and posts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tspsc Group 3 Exam Pattern And Posts

Group 3 Jobs: గ్రూపు-3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? సిలబస్ ఇదే..!

HT Telugu Desk HT Telugu
Apr 29, 2022 07:15 PM IST

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. ఇప్పటికే పోలీసు శాఖ నుంచి నోటిఫికేషన్లు వచ్చేశాయ్. ఇక టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 1 వచ్చింది. మరోవైపు గ్రూపు 2, 3,4 కూడా వచ్చే అవకాశం ఉంది.

గ్రూపు - 3 ఉద్యోగాలు
గ్రూపు - 3 ఉద్యోగాలు (tspsc website)

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి అన్ని శాఖలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖ భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక 500కు పై పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మరోవైపు గ్రూపు 1 2 లో ఇంటర్వూలు కూడా ఎత్తివేశారు. ఇక 1,373 ఉద్యోగాలను గ్రూప్-3లో భాగంగా భర్తీ చేయనున్నారు.  అయితే చాలా మంది గ్రూప్ 3పై డౌట్స్ ఉంటాయి. ఇందులో ఎలాంటి పోస్టులు ఉంటాయి..? సిలబస్ స్వరూపమేంటి..? వంటి అంశాలు మనసులో మెదులుతుంటాయి. అయితే ఇందుకు సంబంధించిన అంశాలను చూస్తే...

ట్రెండింగ్ వార్తలు

గ్రూప్ -3లోని ఉద్యోగాలు..

గ్రూపు -3లో సీనియర్‌ అకౌంటెంట్, ఆడిటర్‌ (పే అండ్‌ అకౌంట్స్‌), సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ), అసిస్టెంట్‌ ఆడిటర్, సీనియర్‌ ఆడిటర్జూనియర్‌ అకౌంటెంట్‌, , జూనియర్‌ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి.

ఎగ్జామ్ ఇలా ఉంటుంది...

గ్రూపు -3లో 3 పరీక్షలు ఉంటాయి. మొత్తం 450 మార్కలకు పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఒక్క పేపర్ కు 150 మార్కులు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు. అత్యధిక మార్కులు రావటంతో పాటు.. రిజర్వేషన్ల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. ఎలాంటి ఇంటర్వూలు ఉండవు.

సిలబస్ ఇదే...

TSPSC Group 3 Syllabus: తొలి పేపర్ లో జనరల్‌ స్టడీస్, జనరల్‌ సైన్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. రెండున్నర గంటల సమయానికి గాను 150 ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికి జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు, జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశ విజయాలు, పర్యావర ణ సమస్యలు, విపత్తు నిర్వహణ - నివారణ, తీవత్రను తగ్గించే వ్యూహాలు, భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, తెలంగాణ రాష్ట్ర విధానాలు, సామాజిక వెనుకబాటు, హక్కులకు సంబంధించిన అంశాలు, సమీకృత విధానాలు, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ వంటి అంశాలు ఇందులో ఉంటాయి.

ఇక పేపర్ -2లో హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ , సోషియో కల్చరల్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియా అండ్‌ తెలంగాణ, ఓవర్‌వ్యూ ఆఫ్‌ ది ఇండియన్‌ కానిస్టిట్యూషన్‌ అండ్‌ పాలిటిక్స్‌, సోషల్‌ స్ట్రక్చర్‌. ఇష్యూస్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీస్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులోనూ 150 ప్రశ్నలు ఉంటాయి.

ఇక చివరిగా 3వ పేపర్ లో ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ , ఇండియన్‌ ఎకానమీ ఇష్యూస్‌ అండ్‌ ఛాలెంజెస్‌, ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ తెలంగాణ , ఇష్యూస్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఛేంజెస్‌ అంశాలు ఉంటాయి. వీటి నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. సమయం రెండున్నర గంటలుగా ఉంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్