TSPSC Group 1 Final Key Released : గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫైనల్ కీ విడుదల.. చెక్ చేసుకోండిలా..-tspsc group 1 preliminary final key released check your results from here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tspsc Group 1 Preliminary Final Key Released Check Your Results From Here

TSPSC Group 1 Final Key Released : గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫైనల్ కీ విడుదల.. చెక్ చేసుకోండిలా..

HT Telugu Desk HT Telugu
Nov 15, 2022 11:11 PM IST

TSPSC Group 1 Prelims Final Key : ఎప్పుడెప్పుడు ఫైనల్ కీ వస్తుందా అని ఎదురుచూసిన గ్రూప్ 1 అభ్యర్థుల గుడ్ న్యూస్. టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ ఫైనల్ కీని విడుదల చేసింది.

టీఎస్పీఎస్పీ ప్రిలిమినరీ ఫైనల్ కీ విడుదల
టీఎస్పీఎస్పీ ప్రిలిమినరీ ఫైనల్ కీ విడుదల

గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫైనల్ కీ ని టీఎస్‌పీఎస్సీ(TSPSC) విడుదల చేసింది. నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో నిపుణుల కమిటీ సమావేశమైంది. ప్రిలిమ్స్(Prelims) ప్రాథమిక కీ అభ్యంతరాలపై అధికారుులు చర్చించారు. తాజాగా కీని విడుదల చేశారు. అయితే అన్ని సమాధానాలు సరిగానే ఉన్నందున.. ఎవరి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ కోసం www.tspsc.gov.in సందర్శించొచ్చు.

ట్రెండింగ్ వార్తలు

అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1(Group 1) రాత పరీక్ష నిర్వహించారు. అదే నెల 29న ప్రాథమిక కీని విడుదల చేశారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించారు. తాజాగా ఫైనల్ కీ(Final Key)ని విడుదల చేశారు. మరోవైపు ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్(Food Safety Officer Key) నియామక పరీక్ష ప్రాథమిక కీ కూడా విడుదల చేశారు అధికారులు. ఈ నెల 20వ తేదీ వరకు అభ్యంతరాలను ఆన్ లైన్ లో సమర్పించాలని కోరారు.

మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది దరఖాస్తు చేసుకోగా 2,86,031 మంది పరీక్ష(Exam) రాశారు. 150 మార్కులకు నిర్వహించిన పరీక్షలో 150 ప్రశ్నలు ఇచ్చారు. ప్రిలిమినరీ(Preiliminary)లో అర్హత సాధించే అభ్యర్థులు మెయిన్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక పోస్టుకు 50 మంది చొప్పున (1:50 నిష్పత్తి ప్రకారం) మెయిన్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దీనిలో కటాఫ్‌ మార్కుల పద్ధతి లేదని పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. మెరిట్‌ జాబితా(Merit List) ప్రకారం మెయిన్‌కు ఎంపిక చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మెయిన్‌ పరీక్ష(Group 1 Main Exam) నిర్వహించే అవకాశం ఉంది.

గ్రూప్‌ –1 పోస్టులు - వివరాలు

ఎంపీడీవో- 121

జిల్లా బీసీ అభివద్ధి అధికారి– 2

అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌– 40

అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌– 38

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(వైద్యారోగ్యశాఖ)– 20

డీఎస్పీ– 91

జైల్స్‌ డిప్యూటీ సూపరిండెంట్‌– 2

అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌– 8

డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌– 2

జిల్లా మైనారీటీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌– 6

మునిసిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ (2) - 35

డీపీవో- 5

కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌- 48

డిప్యూటీ కలెక్టర్‌- 42

అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌- 26

జిల్లా రిజిస్ట్రార్‌- 5

జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌- 3

ఆర్టీవో- 4

జిల్లా గిరిజన సంక్షేమాధికారి- 2

రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పోస్టులను మెుదటిసారిగా భర్తీ చేస్తున్నందున అభ్యర్థుల నుంచి భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. అదే స్థాయిలో అభ్యర్థులు పోటీ పడ్డారు.

WhatsApp channel