టీజీఎస్ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు నేటి నుంచే దరఖాస్తులు-tslprb tgsrtc recruitment 2025 1743 driver and shramik posts application starts from today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  టీజీఎస్ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు నేటి నుంచే దరఖాస్తులు

టీజీఎస్ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు నేటి నుంచే దరఖాస్తులు

Anand Sai HT Telugu

టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. మెుత్తం 1743 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే.

టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో డ్రైవర్, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు మెుదలు అయ్యాయి. ఈ పోస్టుల నియామకాల బాధ్యతను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)కు అప్పగించారు. మొత్తం భర్తీ చేయనున్న ఉద్యోగాలు 1,743. ఇందులో డ్రైవర్‌ కొలువులు 1,000, శ్రామిక్‌ పోస్టులు 743 ఉన్నాయి. అక్టోబరు 8వ తేదీ నుంచి 28 సాయంత్రం 5 గంటల వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి www.tgprb.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.

ఎస్సీ అభ్యర్థులు వర్గీకరణ (గ్రేడ్ 1,2,3) ప్రకారం కొత్త ఫార్మాట్‌లో కుల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. కొత్త సర్టిఫికెట్ అందుబాటులో లేకపోతే... తాత్కాలికంగా పాత ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలన్నారు. అయితే ధ్రువపత్రాల పరిశీలన సమయంలో మాత్రం తప్పనిసరిగా కొత్త ఫార్మాట్‌లో సమర్పించాలని క్లారిటీ ఇచ్చారు.

అర్హతలు

పోస్టుల ప్రకారం ఐటీఐ, పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం కూడా కావాలి. 2025 జులై 1వ తేదీ నాటికి డ్రైవర్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఈఎస్ఎం అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంది.

దరఖాస్తు ఫీజు

దరఖాస్తు ఫీజు చూసుకుంటే.. డ్రైవర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300, ఇతరులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు శ్రామిక్ పోస్టులకు రూ.200, ఇతరులు అయితే రూ.400 దరఖాస్తు ఫీజు ఉంటుంది.

ఎంపిక విధానం, జీతం

ఫిజికల్ మెజర్‌మెంట్, మెడికల్, డ్రైవింగ్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం డ్రైవర్ పోస్టులకు నెలకు రూ. 20,960 నుంచి రూ.60,080 వరకు ఉంటుంది. శ్రామిక్ పోస్టులకు రూ.16,550 నుంచి రూ.45,030 జీతం దొరుకుతుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.