TSLPRB: అలర్ట్.. జూన్ 14 నుంచి SI, కానిస్టేబుల్ అభ్యర్థుల స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ - సెంటర్లు ఎక్కడెక్కడంటే?-tslprb announced si and police constable certificate verification centers check full details are here ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Tslprb Announced Si And Police Constable Certificate Verification Centers Check Full Details Are Here

TSLPRB: అలర్ట్.. జూన్ 14 నుంచి SI, కానిస్టేబుల్ అభ్యర్థుల స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ - సెంటర్లు ఎక్కడెక్కడంటే?

SI, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్
SI, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్

TSLPRB Latest Updates: ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. జూన్ 14 నుంచి స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సెంటర్ల వివరాలను ప్రకటించింది.

TSLPRB SI and Constable Certificate Verification: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగాలకు సంబంధించి తుది దశకు చేరుకుంది. ఇటీవలనే ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాల‌కు సంబంధించిన తుది రాత‌ప‌రీక్ష‌లతో పాటు కీ లను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చింది రిక్రూట్ మెంట్ బోర్డు. తుది రాత‌ప‌రీక్ష ఫ‌లితాల్లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు ఈ నెల 14వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 కేంద్రాల్లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ నిర్వ‌హించ‌ని బోర్డు తెలిపింది. ఈ మేరకు సెంటర్ల వివరాలను పేర్కొంది. తుది ఫ‌లితాల్లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులు టీఎస్ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్ నుంచి స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించిన లెట‌ర్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ లెట‌ర్లు జూన్ 11వ తేదీ ఉద‌యం 8 గంట‌ల నుంచి 13వ తేదీ సాయంత్రం 8 గంట‌ల వ‌ర‌కు https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని వివరించింది.

సెంటర్ల వివరాలు

ఆదిలాబాద్ యూనిట్ – AR హెడ్‌క్వార్ట‌ర్స్ గ్రౌండ్, ఎస్‌పీ ఆఫీసు - 4918 మంది అభ్యర్థులు

సైబ‌రాబాద్ – సీటీసీ, సీపీ ఆఫీసు, గ‌చ్చిబౌలి

హైద‌రాబాద్ – శివ‌కుమార్ లాల్ పోలీసు స్టేడియం, గోషామ‌హ‌ల్‌, హైద‌రాబాద్

క‌రీంన‌గ‌ర్ – పోలీసు హెడ్ క్వార్ట‌ర్స్, క‌రీంన‌గ‌ర్

ఖ‌మ్మం – సిటీ ఆర్మ్‌డ్ రిజ‌ర్వ్ హెడ్ క్వార్ట‌ర్స్, ఖ‌మ్మం

కొత్త‌గూడెం – సీఈఆర్ క్ల‌బ్, ప్ర‌కాశ్ స్టేడియం, కొత్త‌గూడెం

మ‌హ‌బూబాబాద్ – డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు, స‌బ్ జైల్ ద‌గ్గ‌ర‌, మ‌హ‌బూబాబాద్

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ రిజ‌ర్వ్ హెడ్ క్వార్ట‌ర్స్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్

నాగ‌ర్‌క‌ర్నూల్ – డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీస్‌, నాగ‌ర్‌క‌ర్నూల్

గ‌ద్వాల్ – డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు, జోగులాంబ గ‌ద్వాల‌

న‌ల్ల‌గొండ – డార్మెట‌రీ హాల్, పోలీసు హెడ్ క్వార్ట‌ర్స్, న‌ల్ల‌గొండ‌

నిజామాబాద్ – పోలీసు ప‌రేడ్ గ్రౌండ్, సీఏఆర్ హెడ్ క్వార్ట‌ర్స్, నిజామాబాద్

రాచ‌కొండ – సీఏఆర్ హెడ్ క్వార్ట‌ర్స్, అంబ‌ర్‌పేట్, హైద‌రాబాద్

రామ‌గుండం – సీపీ ఆఫీసు, రామ‌గుండం

సంగారెడ్డి – పోలీసు ప‌రేడ్ గ్రౌండ్, ఏఆర్ హెడ్ క్వార్ట‌ర్స్, సంగారెడ్డి

సిద్దిపేట – పోలీసు క‌మిష‌న‌రేట్, సిద్దిపేట‌

సూర్యాపేట – డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు, సూర్యాపేట‌

వ‌రంగ‌ల్ – సీపీ ఆఫీసు, వ‌రంగ‌ల్ -7706 మంది అభ్యర్థులు

కావాల్సిన సర్టిఫికెట్లు…

  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబధించి లెటర్ తప్పనిసరి
  • కుల ధ్రువీకరణపత్రం ఉండాలి.
  • నాన్ క్రిమిలేయర్, ఈడబ్యూఎస్ అర్హత ఉన్నవారు తప్పసరిగా ఆయా పత్రాలను తీసుకురావాలి.
  • ఆధార్ కార్డు
  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
  • పది, ఇంటర్, డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు పీడీఎఫ్ లో ఇచ్చిన వాటికి అనుగుణంగా పత్రాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. పలు పత్రాలపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాలి.

WhatsApp channel