TS TRT 2023 : తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్, ఈ నెల 20 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్
TS TRT 2023 : తెలంగాణ డీఎస్సీ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. ఈలోపు డిటైయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
TS TRT 2023 : తెలంగాణ డీఎస్సీ-2023 నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,089 టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ను ఇవాళ విడుదల చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కసరత్తు చేశారు. ఈ నెల15న జిల్లాల వారీగా సబ్జెక్టులు, మీడియం పోస్టుల ఖాళీల వివరాలు, రోస్టర్ వివరాలు వెల్లడిస్తామని డీఎస్సీ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో అధికారులు బిజీగా ఉండడంతో డీఎస్సీ సమగ్ర నోటిఫికేషన్ విడుదల ఆలస్యమైందని సమాచారం. అయితే డీఎస్సీ సమగ్ర నోటిఫికేషన్ ను సెప్టెంబర్ 18న అధికారులు www.schooledu.telangana.gov.in వెబ్ సైట్ లో ఉంచుతారని అధికారులు తెలిపారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
ట్రెండింగ్ వార్తలు
సెప్టెంబర్ 20 నుంచి రిజిస్ట్రేషన్!
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 20 నుంచి టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (TS TRT 2023) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనుంది. డీఎస్సీ డిటైయిల్డ్ నోటిఫికేషన్ ను అధికారులు వెబ్ సైట్ లో ఉంచుతామని తెలిపారు. ముఖ్యమైన తేదీలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT), స్కూల్ అసిస్టెంట్స్ (లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్), లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేసేందుకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ 2023 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 5,089 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ నెల 20 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానుంది. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 21 చివర తేదీ అని నోటిఫికేషన్ లో తెలిపారు. వయోపరిమితి, విద్యార్హత, ఇతర అర్హత ప్రమాణాలతో సహా డిటైయిల్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ సెప్టెంబర్ 20లోపు విడుదలయ్యే అవకాశం ఉంది.
టీఎస్ టీఆర్టీ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- Step 1 - తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారిక వెబ్‌సైట్‌ని schooledu.telangana.gov.inను సందర్శించండి
- Step 2 -హోమ్‌పేజీలో TS DSC TRT రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
- Step 3 -TS TRT రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు ఫారం పూర్తిచేయండి
- Step 4 -అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించండి
- Step 5 -అప్లికేషన్ ను సబ్మిట్ చేసి, అనంతరం డౌన్‌లోడ్ చేయండి
- Step 6 -భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింటవుట్ తీసుకోండి
- తెలంగాణ డీఎస్సీ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.