TS Inter results 2025 1st year: తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 ఫస్టియర్ ఫలితాలు విడుదల.. ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి…-ts tg inter 1st year result 2025 manabadi live updates tg telangana board 11th results toppers tgbie cgg gov in intermediate first year results direct link marks memo ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Results 2025 1st Year: తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 ఫస్టియర్ ఫలితాలు విడుదల.. ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి…
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల

TS Inter results 2025 1st year: తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 ఫస్టియర్ ఫలితాలు విడుదల.. ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి…

Updated Apr 22, 2025 01:26 PM ISTUpdated Apr 22, 2025 01:26 PM ISTSarath Chandra.B
  • Share on Facebook
Updated Apr 22, 2025 01:26 PM IST

  • TS Inter results 2025 1st year: తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నాంపల్లి ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫస్టియర్‌ ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్‌ ఇక్కడ లభిస్తాయి.

Tue, 22 Apr 202507:56 AM IST

ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రభుత్వ కాలేజీల్లో 53.44 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Tue, 22 Apr 202507:55 AM IST

మేడ్చల్,ములుగు జిల్లాలు ఫస్ట్‌

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మేడ్చల్, ములుగు జిల్లాల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించారు. కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలు చివరి స్థానాల్లో నిలిచాయి,

Tue, 22 Apr 202507:10 AM IST

ఫలితాలు తెలుసుకోండి ఇలా…

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ 2025 ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result

తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ వొకేషనల్ ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result

తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 వొకేషనల్ ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-voc-result

Tue, 22 Apr 202507:08 AM IST

ఐదేళ్లలో మెరుగైన ఉత్తీర్ణత

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత గత ఐదేళ్లతో పోలిస్తే మెరుగు పడింది. 2021లో కోవిడ్ కారణంగా విద్యార్థులందరిని ఉత్తీర్ణులుగా ప్రకటించారు. 2022లో 60.12 శాతం, 2023లో 66.81శాతం, 2024లో 63.86శాతం, 2025లో 67.44శాతం ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల ఫిర్యాదుల కోసం 92402 05555 టోల్‌ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు.

Tue, 22 Apr 202506:59 AM IST

ఫస్టియర్‌లో 66.89శాతం, సెకండియర్‌లో 71.3 శాతం ఉత్తీర్ణత

9,97,015 మంది పరీక్షలకు హాజరయ్యారు. 66.89 శాతం మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌ 71.3 శాతం ఉత్తీర్ణలయ్యారు. మొదటి ఏడాది పరీక్ష, 4,88, 438మంది బాలికలు 73.8శాతం ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో బాలురు 57.83శాతం ఉత్తీర్ణులయ్యరు.

రెండ ఏడాది 5,08,582మంది హాజరయ్యారు. వీరిలో బాలికలు 74.21శాతం ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాది 57.31 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్షలు నిర్వహించిన సిబ్బందిని మంత్రి అభినందించారు.

Tue, 22 Apr 202506:56 AM IST

ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన భట్టి విక్రమార్క

ఇంటర్‌ ఫలితాలను మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఫలితాలను విడుదల చేశారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణాదిత్యలతో కలిసి ఫలితాలను మంత్రి భట్టి విడుదల చేశారు.

Tue, 22 Apr 202506:53 AM IST

గంటలోనే పదిలక్షల మందికి ఫలితాలు

తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఫలితాలు గంటలోనే వెలువడుతాయి. ఇందుకోసం 56 సర్వర్లను ఏర్పాటు చేశారు.

Tue, 22 Apr 202506:51 AM IST

సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణలో మే 22 నుంచి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి.

Tue, 22 Apr 202506:50 AM IST

57లక్షల జవాబు పత్రాల మూల్యంకనం

ఆరు దేశాల్లో 57లక్షల జవాబు పత్రాలను అధ్యాపకులు మూల్యాంకనం చేసినట్టు అధికారులు తెలిపారు.

Tue, 22 Apr 202506:48 AM IST

జనవరిలో మొదలైన ఇంటర్ పరీక్షల ప్రక్రియ

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ప్రక్రియ జనవరిలో ప్రారంభమైంది, 1532కేంద్రాల్లో 9.96లక్షల మంది విద్యార్థులు హాజరైనట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి వివరించారు.

Tue, 22 Apr 202506:44 AM IST

నాంపల్లి బోర్డు కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేరుకున్నారు.

Tue, 22 Apr 202506:42 AM IST

ఫలితాలపై విద్యార్థుల్లో ఉత్కంఠ

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. గత మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు తొమ్మిదిన్నర లక్షల మంది హాజరయ్యారు.

Tue, 22 Apr 202506:36 AM IST

రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్‌ ఇలా

తెలంగాణ ఇంటర్ ఫలితాలపై విద్యార్థులకు అభ్యంతరాలు ఉంటే రీకౌంటింగ్ లేదా రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ ఫీజు సబ్జెక్టుకు రూ.100, రీ-వెరిఫికేషన్ కోసం రూ.600 చెల్లించాలి. ఈ ప్రక్రియ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. విద్యార్థుల కోసం మే-జూన్ 2025లో అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. డిజిలాకర్ ద్వారా కూడా డిజిటల్ మార్కుల షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Tue, 22 Apr 202506:21 AM IST

ఫలితాలపై ఆందోళన వద్దు…

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. పరీక్ష ఫలితాలపై విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణను కూడా ఫలితాలతో పాటు విడుదల చేయనున్నారు.

Tue, 22 Apr 202506:00 AM IST

కాసేపట్లో ఇంటర్ ఫలితాలు విడుదల, ఏర్పాట్లు పూర్తి…

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను మరికాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేస్తారు.

Tue, 22 Apr 202505:54 AM IST

1532 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షల నిర్వహణ

తెలంగాణ ఇంటర్ థియరీ పరీక్షా కేంద్రాల వివరాలు

1.మొత్తం పరీక్షా కేంద్రాల సంఖ్య-1,532

2.ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాలు-400

3. ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాల కేంద్రాలు -242

4.ప్రైవేట్ జూనియర్ కళాశాల కేంద్రాలు- 861

5. పాఠశాలలు/ఇతర కళాశాలలు -29

Tue, 22 Apr 202505:41 AM IST

గత మార్చిలో తెలంగాణ ఇంటర్ పరీక్షలు…

తెలంగాణలో మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ పరీక్షలను ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,532 కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు.

Tue, 22 Apr 202505:35 AM IST

తెలంగాణ ఇంటర్ ఫలితాలను తెలుసుకోండి ఇలా…

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను https://tgbie.cgg.gov.in/ ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌తో పాటు హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు వెబ్‌సైట్‌ https://telugu.hindustantimes.com/ లో కూడా ఇంటర్‌ ఫలితాలను తెలుసుకోవచ్చు.

Tue, 22 Apr 202505:18 AM IST

హెచ్‌టీ ఇంగ్లీషులో ఫలితాలు

హిందుస్తాన్ టైమ్స్ ఇంగ్లీషు వెబ్ సైట్ కూడా ఫలితాలను అందుబాటులోకి తేనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ ‌లో చూడొచ్చు.

Tue, 22 Apr 202505:01 AM IST

ఫలితాలు తెలుసుకోండి ఇలా…

తెలంగాణ ఇంటర్ ఫలితాలు కోసం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఫలితాలు హెచ్‌టి వెబ్‌సైట్‌లో కూడా లభిస్తాయి.

“TS Inter Results 2025” లింక్‌పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత, పరీక్ష సంవత్సరం, స్ట్రీమ్ (జనరల్/వొకేషనల్), హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి, “Get Memo” బటన్‌పై క్లిక్ చేయాలి.

ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది, దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Tue, 22 Apr 202504:47 AM IST

గత ఏడాది ఫలితాలు…

తెలంగాణలో గత ఏడాది ఇంటర్ ఫలితాలలో మొదటి సంవత్సరం పాస్ శాతం 60.01% కాగా, రెండో సంవత్సరం పాస్ శాతం 64.19%గా నమోదైంది. మొత్తం 9.81 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. బాలికల ఉత్తీర్ణతా శాతం 68.35%, బాలుర ఉత్తీర్ణతా శాతం 51.50%గా ఉంది. రంగారెడ్డి జిల్లా మొదటి సంవత్సరంలో, ములుగు జిల్లా రెండవ సంవత్సరంలో మంచి ఫలితాలు కనిపించాయి.

Tue, 22 Apr 202504:35 AM IST

ఇంటర్ పరీక్షలకు 9.96లక్షల మంది విద్యార్థులు హాజరు

తెలంగాణలో ఈ ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.ఇంటర్‌ పరీక్షలు రాసిన వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా.. 5 లక్షలకు మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.

Tue, 22 Apr 202504:30 AM IST

తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం

తెలంగాణలో మరికాసేపట్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారు.

Tue, 22 Apr 202504:08 AM IST

ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ ఫలితాల లింక్ ఇదే…

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ వొకేషనల్ ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result

Tue, 22 Apr 202504:07 AM IST

ఇంటర్‌ ఫస్టియర్ ఫలితాల లింక్ ఇదే

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ 2025 ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result

Tue, 22 Apr 202503:49 AM IST

తెలంగాణలో మరికాసేపట్లో ఇంటర్ ఫలితాలు

తెలంగాణలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థుల ఫలితాలను మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేస్తారు.

Tue, 22 Apr 202503:04 AM IST

ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9.96లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

1. పరీక్షకు హాజరయ్యే మొత్తం విద్యార్థుల సంఖ్య -9,96,971

2. మొదటి సంవత్సరం విద్యార్థులు- 4,88,448

3.రెండో సంవత్సరం విద్యార్థులు (రెగ్యులర్) -4,40,788

4.రెండో సంవత్సరం విద్యార్థులు (ప్రైవేట్)- 67,735

5 .రెండో సంవత్సరం విద్యార్థులు (మొత్తం)- 5,08,523

Tue, 22 Apr 202502:06 AM IST

ఇంటర్ బోర్డు కంట్రోల్ రూమ్ నంబర్లు…

ఇంటర్‌ ఫలితాలపై సందేహాలు పరిష్కరించడానికి నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఉదయం 8:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు పనిచేస్తుంది. విద్యార్థులు తక్షణసహాయం కోసం 040-24600110, 9240205555 నెంబర్లను సంప్రదించవచ్చు.

Tue, 22 Apr 202501:47 AM IST

తెలంగాణలో నేడు ఇంటర్ ఫలితాలు

తెలంగాణలో మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ పరీక్షలను ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,532 కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షల కోసం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లతో సహా 1,532 మంది పరీక్షా సిబ్బందిని నియమించారు.

Tue, 22 Apr 202501:24 AM IST

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల డైరెక్ట్ లింక్స్‌ ఇవే

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను తెలుసుకోండి ఇలా…

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్‌ ద్వారా అందరి కంటే ముందు తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం ఈ లింకులను అనుసరించండి.

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ 2025 ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result

తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ వొకేషనల్ ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result

తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 వొకేషనల్ ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-voc-result

Tue, 22 Apr 202501:10 AM IST

ఇంటర్‌ వెబ్‌సైటులో ఫలితాలు

ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/ లో అందుబాటులో ఉంటాయి. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు తమ హాల్‌ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Tue, 22 Apr 202501:05 AM IST

ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్ధులు ఇప్పటికే ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. దీంతో తెలంగాణ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్‌ 22న ఫలితాల విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటన విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

Tue, 22 Apr 202512:33 AM IST

ఫలితాల కోసం ఎదురు చూస్తున్న 9.5లక్షల మంది విద్యార్థులు

తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం 9.5లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

Tue, 22 Apr 202512:32 AM IST

ఫలితాలు విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం

మంగళవారం మధ్యాహ్నం ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.

Tue, 22 Apr 202512:31 AM IST

నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2025

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్‌,సెకండియర్‌ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఫలితాలను ఆన్‌‌లైన్‌లో విడుదల చేస్తారు.

Tue, 22 Apr 202512:21 AM IST

ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఫలితాల కోసం ఈ లింకును అనుసరించండి

తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 వొకేషనల్ ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-voc-result

Tue, 22 Apr 202512:20 AM IST

ఒకేషనల్ ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్మీడియట్ ఒకేషనల్ పరీక్ష ఫలితాల కోసం ఈ డైరెక్ట్ లింక్ అనుసరించండి.

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ వొకేషనల్ ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result

Tue, 22 Apr 202512:20 AM IST

తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాల లింక్ ఇదే

తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాల కోసం ఈ లింకును అనుసరించండి.

తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result

Tue, 22 Apr 202512:19 AM IST

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల లింక్‌ ఇదే..

తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలను ఈ లింకుల ద్వారా తెలుసుకోవచ్చు. ఫస్టియర్ ఫలితాల కోసం ఈ లింకును అనుసరించండి.

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ 2025 ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result

Tue, 22 Apr 202512:11 AM IST

నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేస్తారు.