TS TET 2024 Hall Tickets : తెలంగాణ టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి-ts tet 2024 hall tickests released at https tstet2024 aptonline in tstet heres direct download link ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet 2024 Hall Tickets : తెలంగాణ టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TS TET 2024 Hall Tickets : తెలంగాణ టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
May 16, 2024 06:53 PM IST

TS TET 2024 Hall Tickets Updates : తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. మే 20వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. వెబ్ సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి…..

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు  2024
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 2024

TS TET 2024 Hall Tickets : తెలంగాణ టెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 20వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే.

How to Download TS TET Hall Tickets 2024: హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే

  • తెలంగాణ టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా schooledu.telangana.gov.in లేదా https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే ' Download Hall Tickets 2024 ఆప్షన్ పై నొక్కాలి.
  • రిజిస్ట్రేషన్(Journal Number) వివరాలతో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
  • పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.

ఈసారి టెట్ పరీక్ష కోసం మొత్తం 2,83,441 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నారు. పేపర్ - 1 కోసం 99,210 మంచి నుంచి దరఖాస్తులువచ్చాయి. పేపర్‌-2(TET Paper 2)కు 1,84,231 మంది అప్లయ్ చేశారు.

TS TET Schedule 2024: తెలంగాణ టెట్ పరీక్ష షెడ్యూల్

  • మే 20, 2024 – పేప‌ర్ 2 - మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)
  • మే 20, 2024 – పేప‌ర్ 2 - మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S)
  • మే 21, 2024 – పేప‌ర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)
  • మే 21, 2024 – పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S2)
  • మే 22, 2024 – పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)
  • మే 22, 2024 – పేప‌ర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S2)
  • మే 24, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ – S1)
  • మే 24, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)
  • మే 28 , 2024– పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S1)
  • మే 28, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)
  • మే 29, 2024 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S1)
  • మే 29, 2024 – పేప‌ర్ 2- సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)
  • మే 30 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
  • మే 30, 2024 – పేప‌ర్ 1- (సెష‌న్ – S2)
  • మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
  • మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S2)
  • జూన్ 1 , 2024– పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ – S1)
  • జూన్ 1, 2024 – పేప‌ర్ 1-(మైన‌ర్ మీడియం) (సెష‌న్ – S2)
  • జూన్ 2 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
  • జూన్ 2 , 2024– పేప‌ర్ 1- (సెష‌న్ – S2).

మరోవైపు తెలంగాణ టెట్(TET)కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం విద్యాశాఖ ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ తీసుకొచ్చింది. https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ పరీక్షలను రాసుకొవచ్చు.