TS SET Notification 2024 : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల - మే 14 నుంచి దరఖాస్తులు, ముఖ్య తేదీలివే-ts set notification 2024 released key dates are check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Set Notification 2024 : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల - మే 14 నుంచి దరఖాస్తులు, ముఖ్య తేదీలివే

TS SET Notification 2024 : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల - మే 14 నుంచి దరఖాస్తులు, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
May 05, 2024 08:32 AM IST

TS SET Notification 2024 : తెలంగాణ సెట్ - 2024 నోటిఫికేషన్(TS SET Notification) విడుదలైంది. మే 14వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. http://telanganaset.org లింక్ తో దరఖాస్తుల ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

తెలంగాణ సెట్ నోటిఫికేషన్ - 2024
తెలంగాణ సెట్ నోటిఫికేషన్ - 2024

TS SET Notification 2024 Updates: తెలంగాణ సెట్ - 2024(Telangana State Eligibility Test) నోటిఫికేషన్ వచ్చేసింది. శనివారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ మేరకు ముఖ్య తేదీలను ప్రకటించారు. 

ఈ ఏడాది కూడా తెలంగాణ సెట్ -  2024(Telangana State Eligibility Test Exam) పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ(OU) నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. 

మే 14 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు…

మే14వ తేదీ నుంచి తెలంగాణ సెట్ దరఖాస్తులు(TS SET Applications 2024) ప్రారంభం కానున్నాయి. ఆన్ లైన్ లోనే దరఖాస్తులను సమర్పించాలి. జూలై 2వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది. ఫైన్ తో జూలై 26వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. 

ఆగస్టు 20వ తేదీ నుంచి సెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఆగస్టు 28 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఆగస్టు 31వ తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయని తెలంగాణ సెట్ అధికారులు వెల్లడించారు. http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

తెలంగాణ సెట్ ను 2 పేపర్లలో(TS SET Exam 2024) నిర్వహిస్తారు. పేప‌ర్-1లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు ఉంటాయి. ఇక పేప‌ర్-2లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులతో నిర్వహిస్తారు. కంప్యూట‌ర్ బేస్డ్ ప‌ద్ధతిలో మూడు గంటల పాటు ప‌రీక్ష నిర్వహిస్తారు.

How to Apply TS SET 2024 : ఇలా దరఖాస్తు చేసుకోండి….

  • అభ్యర్థులు ముందుగా http://telanganaset.org/index.htm  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • TS SET Apply Online అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీకు దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
  • మీ వివరాలతో పాటు విద్యార్హతలను ఎంటర్ చేయాలి. ఇందులోనే మీరు ఎగ్జామ్ సెంటర్ ను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • నిర్ణయించిన అప్లికేషన్ రుసుం చెల్లించాలి. ఆన్ లైన్ పేమెంట్  అందుబాటులో ఉంటుంది.
  • ఫైనల్ గా సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
  • ప్రింట్ ఆప్షన్ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.

ముఖ్య వివరాలు:

  • జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్  -పేపర్-1 గా ఉంటుంది.
  • పేపర్ - 2 అనేది అభ్యర్థి పీజీ పూర్తి చేసిన సబ్జెక్టుపై రాసుకోవాల్సి ఉంటుంది. ఇందులో జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ సబ్జెక్టులు ఉంటాయి.
  • వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి లేదు.
  • కంప్యూటర్‌ ఆధారిత టెస్టు (సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి.
  • పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. 
  • పరీక్ష వ్యవధి మూడు గంటలు.
  • ఆబ్జెక్టివ్‌ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్‌–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు.  ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.
  • ఈ పేపర్‌ 2 లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.
  • ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
  • తెలంగాణ సెట్ అధికారిక వెబ్‌సైట్‌ : http://www.telanganaset.org/ 

 

 

Whats_app_banner