TS POLYCET Results 2023: విద్యార్థులకు అలర్ట్... ఈ నెలాఖరులోనే పాలిసెట్‌ ఫలితాలు!-ts polycet results 2023 will be announced last week of may 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Polycet Results 2023 Will Be Announced Last Week Of May 2023

TS POLYCET Results 2023: విద్యార్థులకు అలర్ట్... ఈ నెలాఖరులోనే పాలిసెట్‌ ఫలితాలు!

HT Telugu Desk HT Telugu
May 18, 2023 01:36 PM IST

TS POLYCET Results Updates: పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. ఈ నెలాఖరులోనే ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు.

త్వరలోనే పాలిసెట్ ఫలితాలు
త్వరలోనే పాలిసెట్ ఫలితాలు

TS POLYCET Results 2023: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం తెలంగాణ పాలిసెట్ 2023 ప్రవేశ పరీక్ష ముగిసింది. అయితే ఇందుకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది సాంకేతిక విద్యా మండలి. ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేస్తామని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా ఫలితాలను ఇస్తామని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 296 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 92.94శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

పాలిసెట్ ఫలితాల్లో అర్హత సాధించి వారు రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు. ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు. పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్‌ చేస్తారు.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు

విద్యార్థులు మొదటగా https://polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ పొందవచ్చు.

అడ్మిషన్ ప్రక్రియతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం ర్యాంక్ కార్డు అవసరం.

మరోవైపు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌కు రూ. 500 జరిమానా చెల్లించి దరఖాస్తు చేసుకొనేందుకు గురువారం(మే 18) చివరి గడువుగా నిర్ణయించారు అధికారులు.మే 26, 27 తేదీల్లో ఐసెట్ ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం తెలంగాణలో 16, ఏపీలో 4 పరీక్షాకేంద్రాలను ఎంపిక చేశారు. జూన్ 5న ప్రాథమిక కీ విడుదల అవుతుంది. ఆన్సర్ కీపై జూన్ 8న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను పంపవచ్చు. జూన్ 20న ఫైనల్ కీతో పాటు ఫలితాలను విడుదల అవుతాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణ, ఆన్‌లైన్‌ పరీక్ష, పరీక్ష కేంద్రాల జాబితా, మాక్‌ టెస్టుల, హాల్ టికెట్లు, ఫలితాలు విడుదలతో పాటు ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://tsicet.nic.in/ ను సందర్శించవచ్చు.

IPL_Entry_Point