TS POLYCET Results : విద్యార్థులకు అలర్ట్... మే 26న పాలీసెట్ ఫలితాలు-ts polycet result 2023 will be out on may 26 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Polycet Result 2023 Will Be Out On May 26

TS POLYCET Results : విద్యార్థులకు అలర్ట్... మే 26న పాలీసెట్ ఫలితాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
May 25, 2023 06:21 AM IST

TS POLYCET Results Updates: పాలీసెట్ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. మే 26వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

TS POLYCET Results 2023: తెలంగాణ పాలీసెట్‌ - 2023 ఫలితాలపై కీలక ప్రకటన చేసింది రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి. మే 26వ తేదీన పాలీసెట్‌ 2023 ఫ‌లితాలను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌సాబ్ ట్యాంక్‌లోని ఎస్వీ భ‌వ‌న్‌లో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు సీటీఈ చైర్మ‌న్ న‌వీన్ మిట్ట‌ల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఫ‌లితాలు అదుబాటులో ఉంటాయని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

మే 17న రాష్ట్ర వ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు మొత్తంగా 98,273 మంది అభ్యర్థులు హాజరయ్యారు.ఇందులో 54,700 మంది అబ్బాయిలు ఉండగా, 43,573 మంది అమ్మాయిలు ఉన్నారు. పాలీసెట్ ఫలితాల్లో అర్హత సాధించి వారు రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు. ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు. పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్‌ చేస్తారు.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు

విద్యార్థులు మొదటగా https://polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

పాలీసెట్ రిజల్ట్స్ - 2-23 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ పొందవచ్చు.

అడ్మిషన్ ప్రక్రియతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం ర్యాంక్ కార్డు అవసరం.

ఇవాళ్టి నుంచి ఏపీ పాలీసెట్ కౌన్సెలింగ్…

AP POLYCET 2023 Counselling Dates: మరోవైపు పాలీసెట్ విద్యార్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ సాంకేతిక విద్యాశాఖ. ఇప్పటికే ఫలితాలు ప్రకటించగా... తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. ఇవాళ్టి నుంచి నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు మే25 నుంచి జూన్‌ 1 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన మే 29 నుంచి జూన్‌ 5 వరకు నిర్వహించనున్నారు. జూన్‌ ఒకటి నుంచి 6వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. జూన్‌ 7న ఆప్షన్స్ మార్పును అవకాశం ఉంటుంది. జూన్‌ 9న సీట్ల కేటాయింపు చేస్తారు. అడ్మిషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత జూన్ 15 నుంచి అన్ని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.

కౌన్సెలింగ్ కు కావాల్సినవి:

-ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డు

-హాల్ టికెట్

-మార్కుల మోమోలు

-బోనఫైడ్ సర్టిఫికెట్లు

-ఆధార్ కార్డు

-కుల ధ్రువీకరణపత్రం

-ఫొటో మరియు సంతకం

ఇక ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసిన వారిలో 89.56 శాతం మంది విద్యార్ధులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికలు 63,201 మంది దరఖాస్తు దారుల్లో 55,562 ఉన్నారు. 87.91 శాతం మంది బాలికలు ప్రవేశపరీక్షకు మాజరయ్యారు. 97,128 మంది బాలురకు గాను 88,030మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. 90.63 శాతం మంది పరీక్షలు రాశారు.ఈసారి ఎంట్రెన్స్ పరీక్షలో మొత్తం 1,24,021 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం