TS PGECET Results 2023: తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల - ర్యాంక్ కార్డు డౌన్లోడ్ లింక్ ఇదే-ts pgecet results 2023 released download rank card are here ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Ts Pgecet Results 2023 Released Download Rank Card Are Here

TS PGECET Results 2023: తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల - ర్యాంక్ కార్డు డౌన్లోడ్ లింక్ ఇదే

తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు 2023
తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు 2023

TS PGECET Results 2023 Updates: తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్. గురువారం మధ్యాహ్నం ఉన్నత విద్యా మండలి అధికారులు ఫలితాలను ప్రకటించారు. pgecet.tsche.ac.in లింక్ తో రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

TS PGECETTS PGECET Results 2023: తెలంగాణ పీజీఈ సెట్ (TS PGECET)-2023 ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి రిలీజ్ చేశారు. ర్యాంక్ ల ఆధారంగా... 2023-24 విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌/ఫార్మసీ/ఆర్కిటెక్చర్‌ కాలేజీల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్‌, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మే 29 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షల ఫలితాలను https://pgecet.tsche.ac.in/ లో చెక్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ఇలా డౌన్లోడ్ చేసుకోండి…

Step 1 : ముందుగా TS PGECET అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి - pgecet.tsche.ac.in

Step 2 : “డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్” లింక్‌పై క్లిక్ చేయండి

Step 3 : అభ్యర్థుల లాగిన్ వివరాలు నమోదు చేయండి - హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ

Step 4 : "లాగిన్" బటన్ పై క్లిక్ చేయండి

Step 5 : TS PGECET ర్యాంక్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

దీన్ని PDF ఫైల్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి.

ఈ ఏడాదికి సంబంధించి టీఎస్ పీజీఈసెట్‌-2023 ప్రవేశ ప‌రీక్షను హైదరాబాద్ జేఎన్టీయూ నిర్వహించింది. మే 29 నుంచి జూన్ 1 వరకు ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు జియో ఇంజినీరింగ్, జియో ఇన్ఫర్మెటిక్స్, ఫార్మసీ కోర్సుల‌కు, మ‌ధ్యాహ్నం 2 నుంచి 4 గంట‌ల వ‌ర‌కు సివిల్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాల‌జీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ప‌రీక్షలు జరిగాయి. ఉద‌యం సెష‌న్‌కు 96.13 శాతం మంది విద్యార్థులు, మ‌ధ్యాహ్నం సెష‌న్‌కు 88.01 శాతం మంది విద్యార్థులు హాజ‌రైన‌ట్లు పీజీఈసెట్ క‌న్వీన‌ర్ వెల్లడించారు.

ఇక ఏపీ పీజీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు "ఏపీ పీజీసెట్‌-2023" పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు అధికారులు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ తో హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు, పరీక్ష పేపర్ వివరాలు నమోదు చేసి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాలు, హైదరాబాద్‌లో ఒక కేంద్రంలో పీజీ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 6 నుంచి 10 వరకు రోజుకు మూడు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు తొలిసెషన్‌, మధ్నాహ్నం 1 గంట నుంచి 2.30 గంటల వరకు రెండో సెషన్‌, తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీలను జూన్ 8 నుంచి 12 వరకు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. పరీక్ష పూర్తైన రెండు రోజులకు ఆన్సర్ కీ విడుదల అవుతుంది. జూన్ 10 నుంచి 14 వరకు ఆన్సర్ కీలపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు.