TS LAWCET 2024 Update : టీఎస్ లా సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే?-ts lawcet ts pglcet 2024 application last date april check apply process in tsche ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Lawcet 2024 Update : టీఎస్ లా సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే?

TS LAWCET 2024 Update : టీఎస్ లా సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే?

Bandaru Satyaprasad HT Telugu
Apr 15, 2024 05:23 PM IST

TS LAWCET 2024 Update : ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న టీఎస్ లా సెట్, పీజీఎల్ సెట్ దరఖాస్తు గడువును మరో పది రోజులు పొడిగించారు. ఏప్రిల్ 25 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.

టీఎస్ లా సెట్, పీజీఎల్ సెట్
టీఎస్ లా సెట్, పీజీఎల్ సెట్

TS LAWCET 2024 Update : గత షెడ్యూల్ ప్రకారం తెలంగాణ లా సెట్(TS LAWCET), పీజీఎల్ సెట్(TS PGLCET)-2024 దరఖాస్తు గడువు నేటితో(ఏప్రిల్ 15) ముగిసింది. అయితే దరఖాస్తు గడువును మరో పది రోజులు పొడిగించారు. అంటే ఏప్రిల్ 25 వరకు అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. లా సెట్ మార్చి 1న అప్లికేషన్లు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) టీఎస్ లా సెట్, పీజీఎల్ సెట్-2024 పరీక్షను జూన్ 3 నిర్వహిస్తుంది. కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష ఉంటుంది.

అర్హత వివరాలు

తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS LAWCET 2024), తెలంగాణ స్టేట్ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS PGLCET 2024) కోసం దరఖాస్తు కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://lawcet.tsche.ac.in/# ను సందర్శించండి. 2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహిస్తోంది. అభ్యర్థులు 3 సంవత్సరాల లా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. జనరల్ అభ్యర్థులు 45%, ఓబీసీ 42% , ఎస్సీ,ఎస్టీలు 40% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి. 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు... జనరల్ 45%, OBC 42%, ఎస్సీ, ఎస్టీ 40% శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించాలి. లా కోర్సుల్లో ప్రవేశాలకు వయోపరిమితి లేదు.

అర్హత మార్కులు

లా సెట్ (TS LAWCET)లో కనీస మార్కుల అర్హత శాతం 35% అంటే మొత్తం 120 మార్కులలో 42 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులుక కనీస అర్హత మార్కులు నిర్దేశించలేదు. TS PGLCET-2024 ప్రవేశ పరీక్షలో కనీస మార్కుల అర్హత శాతం 25% అంటే మొత్తం 120 మార్కులలో 30 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులుక కనీస మార్కుల అర్హత శాతం ఉండదు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ- మార్చి 1, 2024

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ

- ఏప్రిల్ 25, 2024 (ఆలస్య రుసుము లేకుండా)

-మే 5, 2024(ఆలస్య రుసుము రూ.1,000)

-మే 15, 2024( ఆలస్య రుసుము రూ.2,000)

-మే 25, 2024( ఆలస్య రుసుము రూ.4,000)

అప్లికేషన్ ఫీజు వివరాలు

  • TS LAWCET 2024 - జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.900, SC/ST, PH అభ్యర్థులకు రూ.600
  • TS PGLCET 2024 - జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1100, SC/ST, PH అభ్యర్థులకు రూ.900

పరీక్ష తేదీ

  • టీఎస్ లా సెట్ (3 ఏళ్ల ఎల్ఎల్బీ)- జూన్ 3 ( ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు)
  • టీఎస్ లా సెట్ (5 ఏళ్ల ఎల్ఎల్బీ) -జూన్ 3 ( మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 వరకు)
  • టీఎస్ పీజీఎల్ సెట్ (LL.M.)- జూన్ 3 ( మధ్నాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 వరకు)

IPL_Entry_Point

సంబంధిత కథనం