TS LAWCET 2024 Updates : తెలంగాణ లాసెట్ ప్రవేశాలు - తక్కువ ఫైన్ తో దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్-ts lawcet last date for registration and submission of online application form with late fee of rs 500 may 10 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Lawcet 2024 Updates : తెలంగాణ లాసెట్ ప్రవేశాలు - తక్కువ ఫైన్ తో దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

TS LAWCET 2024 Updates : తెలంగాణ లాసెట్ ప్రవేశాలు - తక్కువ ఫైన్ తో దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

Maheshwaram Mahendra Chary HT Telugu
May 09, 2024 11:19 PM IST

TS LAWCET 2024 Latest Updates : లాసెట్(TS LAWCET 2024) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆలస్యం రుసుంతో అప్లికేషన్ల స్వీకరణ కొనసాగుతుండగా… కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు.

తెలంగాణ లాసెట్ 2024
తెలంగాణ లాసెట్ 2024

TS LAWCET 2024 Updates : తెలంగాణ లాసెట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం రూ. 500 ఆలస్య రుసుంతో దరఖాస్తుల స్వీకరణ నడుస్తోంది. ఈ గడువు కూడా మే 10వ తేదీతో పూర్తి కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ గడువు పూర్తి అయితే రూ.1000 ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రూ.1000 ఆలస్య రుసుంతో మే 18 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రూ.2 వేల ఆలస్య రుసుంతో మే 25 వరకు…. రూ.3 వేల ఆలస్య రుసుంతో మే 29 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

How to apply For TS LAWCET 2024: ఇలా దరఖాస్తు చేసుకోండి….

  • అర్హత గల అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • TS LAWCET & TS PGLCET 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
  • తొలుత పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాలి.
  • STEP 2:Fill Application Form అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై నొక్కి మీ వివరాలను ఎంట్రీ చేయాలి. ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • సబ్మిట్ బటన్ నొక్కటంతో మీ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
  • Download Application Form అనే ఆప్షన్ పై నొక్కి మీ దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్ ఫారమ్ లో ఉండే రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ నెంబర్ అవసరపడుతుంది.

2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహిస్తోంది.

అభ్యర్థులు 3 సంవత్సరాల లా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. జనరల్ అభ్యర్థులు 45%, ఓబీసీ 42% , ఎస్సీ,ఎస్టీలు 40% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి. 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు... జనరల్ 45%, OBC 42%, ఎస్సీ, ఎస్టీ 40% శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించాలి. లా కోర్సుల్లో ప్రవేశాలకు వయోపరిమితి లేదు.

తెలంగాణ లాసెట్ ప్రవేశ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల సమయం ఉంటుంది. ఎల్ఎల్ బీ ఐదేళ్లు, మూడేళ్ల కోర్సులకు వేర్వురు ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఎల్ఎల్ఎం కు కూడా ప్రత్యేక ప్రశ్నాపత్రం ఉంటుంది.

లాసెట్ పరీక్ష తేదీ - వివరాలు

టీఎస్ లాసెట్ (3 ఏళ్ల ఎల్ఎల్బీ)- జూన్ 3 ( ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు)

టీఎస్ లాసెట్ (5 ఏళ్ల ఎల్ఎల్బీ) -జూన్ 3 ( మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 వరకు)

టీఎస్ పీజీఎల్ సెట్ (LL.M.)- జూన్ 3 ( మధ్నాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 వరకు)

Whats_app_banner