TS LAWCET 2023: లాసెట్ హాల్ టికెట్లు విడుదల.. ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి-ts lawcet 2023 hall tickets released download admit card here ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Ts Lawcet 2023 Hall Tickets Released Download Admit Card Here

TS LAWCET 2023: లాసెట్ హాల్ టికెట్లు విడుదల.. ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ లాసెట్
తెలంగాణ లాసెట్

TS LAWCET 2023 Updates: తెలంగాణ లాసెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. మే 25వ తేదీన రాత పరీక్షను నిర్వహించనున్నారు. ఏపీ లాసెట్ హాల్ టికెట్లు కూడా రిలీజ్ అయ్యాయి.

TS LAWCET Hall Tickets 2023: తెలంగాణ లాసెట్ - 2023కి సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు మంగళవారం నుంచి వెబ్ సైట్ లో హాల్ టికెట్లను ఉంచారు. మే 25వ తేదీన టీఎస్ లాసెట్‌, టీఎస్ పీజీ ఎల్‌సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

ఇలా డౌన్లోడ్ చేసుకోండి

అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://lawcet.tsche.ac.in/ లోకి వెళ్లాలి.

డౌన్లోడ్ హాల్ టికెట్లు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బటన్ పై నొక్కితే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ పొందవచ్చు.

ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.

మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో చేరేందుకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక ఎల్ఎల్ బీ ఐదేళ్ల కోర్సులో చేరాలంటే ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఇక ఎల్ఎల్ ఎం చేయాలంటే... ఎల్ఎల్ బీ డిగ్రీ ఉండాలి. పూర్తి వివరాల కోసం https://lawcet.tsche.ac.in ద్వారా సంబంధిత సైట్ ను సందర్శించవచ్చు. సంబంధిత వివరాల ఆధారంగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ఏపీ లాసెట్ హాల్ టికెట్లు విడుదల…

AP LAWCET Hall Tickets: మరోవైపు ఏపీ లాసెట్ హాల్ టికెట్లు కూడా విడుదల అయ్యాయి. అభ్యర్థులు అధికారిక పోర్టల్ cets.apsche.ap.gov.in ద్వారా అడ్మిట్‌ కార్డ్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రాసెస్ ఇదే…

అభ్యర్థులు ముందుగా cets.apsche.ap.gov.in విజిట్ చేయాలి. హోమ్ పేజీలో AP LAWCET అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

డౌన్‌లోడ్ హాల్ టికెట్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

మీ రిజిస్టర్ నంబర్, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి.

దీంతో మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అన్ని వివరాలు పరిశీలించి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ లాసెట్ ఎగ్జామ్ మే 20న ఓకే షిష్ట్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల మధ్య జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఏపీ ఉన్నత విద్యామండలి.

WhatsApp channel