ts inter supply results 2024: ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల-ts inter supply results 2024 manabadi live 1st year and 2nd year direct links ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Supply Results 2024: ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల

టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

ts inter supply results 2024: ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల

08:55 AM ISTJun 24, 2024 02:25 PM HT Telugu Desk
  • Share on Facebook
08:55 AM IST

  • ts inter supply results 2024: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకు విడుదలయ్యాయి.

Mon, 24 Jun 202408:48 AM IST

రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ నిబంధనలు ఇవే

విద్యార్థులు రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ కోసమైతే పేపర్ కు రూ. 100 చొప్పున దరఖాస్తు రుసుం ఆన్ లైన్‌లో చెల్లించాలి. రీవెరిఫికేషన్ ఆఫ్ స్కాన్‌డ్ కాపీ ఆఫ్ ఆన్సర్ షీట్ కోసం అయితే పేపర్ కు రూ. 600 చొప్పున చెల్లించాలి. 25వ తేదీ నుంచి 29వ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Mon, 24 Jun 202408:43 AM IST

కలర్ ప్రింటవుట్ తీసుకోవచ్చు

విద్యార్థులు తమ ఆన్ లైన్ మెమొరాండమ్ ఆఫ్ మార్క్స్ (షార్ట్ మెమో) ను బోర్డు వెబ్ సైట్ నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి డౌన్ లోడ్ తీసుకుని కలర్ ప్రింట్ తీసిపెట్టుకోవాలని బోర్డు సూచించింది.

Mon, 24 Jun 202408:41 AM IST

ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీలో 43.77 శాతం ఉత్తీర్ణత

ఇంటర్ సెకండియర్ జనరల్ లో 1,38,477 మంది, వొకేషనల్ కేటగిరీలో 15,136 మంది హాజరయ్యారు. అయితే ఇంటర్ సెకండియర్ జనరల్ కేటగిరీలో ఏ గ్రేడులో కేవలం 28 మంది, బీ గ్రేడులో 20 మంది, సీ గ్రేడులో ఒకరు, డీ గ్రేడులో ఇద్దరు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 60,615 మంది ఉత్తీర్ణులయ్యారు. వార్షిక పరీక్షలు, సప్లిమెంటరీ పరీక్షల్లో కలిపి మొత్తంగా ఇంటర్ సెకండియర్ లో 3,54,242 మంది (76.69 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీకి హాజరైన వారిలో 43.77 శాతం మంద ఉత్తీర్ణులయ్యారు.

Mon, 24 Jun 202408:39 AM IST

ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీలో 63.86 శాతం ఉత్తీర్ణత

ఇంటర్ ఫస్టియర్ జనరల్ లో 2,54,498 మంది, ఒకేషనల్ పరీక్షలకు 18,913 మంది హాజరయ్యారు. వీరిలో జనరల్ కేటగిరీలో ఏ గ్రేడులో 82,910 మంది ఉత్తీర్ణులయ్యారు. బీ గ్రేడ్ లో 40,143 మంది, సీ గ్రేడులో 24,540 మంది ఉత్తీర్ణులయ్యారు. డీ గ్రేడులో 14,927 మంది పాసయ్యారు. మొత్తంగా 1,82,520 మంది పాసయ్యారు. ఇందులో 1,06,484 మంది ఇంప్రూవ్‌మెంట్ రాసిన వారున్నారు. 56,036 మంది మార్చి పరీక్షల్లో ఫెయిలై ఇప్పుడు రాసిన వారు ఉన్నారు. మొత్తంగా వార్షిక పరీక్షలు, సప్లిమెంటరీ కలిపి ఇంటర్ ఫస్టియర్లో 3,18,967 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 74.1 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన వారిలో 63.86 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Mon, 24 Jun 202408:34 AM IST

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు (IPASE) 24-05-2024 నుండి 03-06-2024 వరకు మరియు ప్రాక్టికల్ పరీక్షలు 04-06-2024 నుండి 08-06-2024 వరకు జరిగాయి. జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులకు మొదటి సంవత్సరం & రెండవ సంవత్సరం IPASE మే/జూన్ 2024కి హాజరైన అభ్యర్థుల ఫలితాలు 2 గంటలకు విడుదలయ్యాయి.

Mon, 24 Jun 202408:32 AM IST

TS Inter 2nd year supplimentary results 2024: రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే

ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు https://results.cgg.gov.in/ వెబ్ సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.

Mon, 24 Jun 202408:31 AM IST

TS Inter 1st year supplimentary results 2024: రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే

ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు https://results.cgg.gov.in/ వెబ్ సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.

Mon, 24 Jun 202408:26 AM IST

రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు https://tgbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. లేదా https://results.cgg.gov.in/ వెబ్ సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.

Mon, 24 Jun 202408:25 AM IST

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 4.5 లక్షల మంది హాజరు

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఇంప్రూవ్ మెంట్ రాసిన వారు కూడా ఉన్నారు.

Mon, 24 Jun 202408:25 AM IST

ఇంటర్ ద్వితీయ సంవత్సరం (మార్చి పరీక్షలు)

మార్చిలో నిర్వహించిన పరీక్షల్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో జనరల్ విభాగంలో 69.46శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్‌ విద్యార్థుల్లో 63.86శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండు విభాగాల్లో కలిపి 64.19శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు జనరల్ విభాగంలో 4,01,445మంది హాజరయ్యారు. మరో 54,228మంది ప్రైవేట్‌గా పరీక్షలు రాశారు. ఒకేషనల్ కోర్సుల్లో 42,723మంది హాజరయ్యారు. ఇంటర్ సెకండియర్‌లో 1,77,109మంది 75శాతం పైగా మార్కులతో ఏ గ్రేడ్ సాధించారు. 68,378మంది 60శాతానికి పైగా మార్కులతో బి గ్రేడ్ సాధించారు. 25,478మంది 50శాతం మార్కులతో సి గ్రేడ్ దక్కించుకున్నారు. డి గ్రేడ్‌లో 7,891మంది ఉన్నారు. ఇంటర్ సెకండియర్‌లో మొత్తం 2,78,856మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్‌గా పరీక్షలు రాసిన 14,740మంది కూడా ఉత్తీర్ణత సాధించారు.

Mon, 24 Jun 202408:24 AM IST

మార్చిలో నిర్వహించిన పరీక్షల్లో 61.06 శాతం ఉత్తీర్ణత

మార్చిలో నిర్వహించిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలకు మొత్తం 4,78,723మంది హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్‌ ఇంటర్‌ విద్యార్ధులు 4,30,413మంది ఒకేషనల్ విద్యార్ధులు 48,310మంది ఉన్నారు. మొదటి సంవత్సరంలో మొత్తం 61.06శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విద్యార్ధుల్లో 50.57శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్ కలిపి మొదటి సంవత్సరంలో 2,87,261 మంది ఉత్తీర్ణులుయ్యారు. ఉత్తీర్ణతా శాతం 60.01శాతంగా ఉంది.

Mon, 24 Jun 202408:26 AM IST

TS Inter Supplementary Results 2024 - ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల లింక్

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు https://tgbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. లేదా https://results.cgg.gov.in/ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.

ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మే/జూన్ - 2024 ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీరు ఏ ఇయర్ పరీక్ష రాశారో అక్కడ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి… మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బటన్ పై నొక్కితే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

ప్రింట్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు.

Mon, 24 Jun 202408:13 AM IST

జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

జూన్‌ 27వ తేదీ నుంచి ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు కౌన్సిల్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఈ ఏడాది మొత్తం మూడు విడతల్లో జరగనుంది. జూన్‌ 30 నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్‌ ఆప్షన్లకు ఛాన్స్ కల్పించారు. జులై 12న తొలి విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 16వ తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Mon, 24 Jun 202408:25 AM IST

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 4.5 లక్షల మంది హాజరు

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫెయిల్ అయిన వారితో పాటు ఇంప్రూవ్ మెంట్ రాసిన వారు కూడా ఉన్నారు.

Mon, 24 Jun 202408:06 AM IST

21 రోజుల వ్యవధిలోనే ఫలితాలు

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు గత నెల 24వ తేదీ నుంచి ప్రారంభమై… జూన్ 3వ తేదీతో ముగిశాయి. 21 రోజుల వ్యవధిలోనే ఫలితాలు వెలువడుతున్నాయి.

Mon, 24 Jun 202408:05 AM IST

మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు

నేడు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.