TS Inter Supply Results : ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - డైెరెక్ట్ లింక్ ఇదే
TS Inter Supplementary Results 2023: తెలంగాణ ఇంటర్మీడియేట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
TS Inter Supplementary Results 2023 Updates : విద్యార్థులకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్. మధ్యాహ్నం 2 గంటలకు అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలని అధికారులు సూచించారు. https://results.cgg.gov.in సైట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు చెందిన 2,52,055 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయగా… 1,57,741 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 18,697 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 10,319 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో జనరల్ విద్యార్థులు 46 శాతం, వొకేషనల్ విద్యార్థులు 60 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ అధికారులు తెలిపారు. సెకండియర్‌కు చెందిన 1,29,494 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయగా, 59,669 మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ కోర్సులకు సంబంధించి 11,013 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 6,579 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇలా చెక్ చేసుకోండి…
విద్యార్థులు మొదటగా https://tsbie.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
TS Inter Supplementary Results 2023 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మీ రోల్ నెంబర్ ఎంట్రీ చేయాలి.
క్లిక్ బటన్ పై నొక్కితే మీ రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
ఇంటర్ లేదా ఇతర అడ్మిషన్ ప్రక్రియలో మెమో చాలా కీలకం.
తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించి పూర్తి వివరాలు కింద ఇచ్చిన PDFలో ఉన్నాయి…
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఉదయం ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్ వారికి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షాకేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు.ఇక.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌కి కలిపి మొత్తం 4,12,325 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్‌కి 2,70,583 మంది, సెకండియర్‌కి 1,41,742 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
ఇక ఈ ఏడాది జరిగిన ఇంటర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.85 శాతం ఉత్తీర్ణత, సెకండియర్ 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఫస్టియర్‌లో బాలురు 54.66 శాతం పాసయితే, బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. అలాగే సెకండియర్‌లో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం పాస్ కావడం గమనార్హం. ఇంటర్ రెగ్యులర్ పరీక్షలకు ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,48,153 మంది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.