TS Inter Supplementary Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల-ts inter supplementary exams from 12th june hall tickets ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Inter Supplementary Exams From 12th June Hall Tickets

TS Inter Supplementary Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 08, 2023 05:00 PM IST

TS Inter Supply Exam Hall Tickets 2023: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ ఇంటర్ బోర్డు. సప్లిమెంటరీ పరీక్షలు హాల్ టికెట్లను విడుదల చేసింది.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2023
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2023

TS Inter Supplementary Exams Updates 2023: తెలంగాణ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హాల్ టికెట్ల విడుదల చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు. https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

జూన్ 12 నుంచి 22వ తేదీ వరకూ ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించున్నారు ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. జూన్ 5 నుంచి 9 వరకు రెండు సెషన్స్ లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. మార్నింగ్ సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.

హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి...

విద్యార్థులు మొదటగా https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

Student Hall Tickets -IPASE JUNE 2023 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. (ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, బ్రిడ్జి కోర్సులు ఉంటాయి).

మీకు కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత... మరో విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పదో తరగతి లేదా ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

గెట్ హాల్ టికెట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ పొందవచ్చు.

పరీక్షల షెడ్యూల్…

ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ షెడ్యూల్ ఇలా( ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు)

12-06-2023(సోమవారం) : సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

13-06-2023(మంగళవారం) : ఇంగ్లీష్ పేపర్-1

14-06-2023(బుధవారం): మ్యాథమెటిక్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1

15-06-2023(గురువారం): మ్యాథమెటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ-1

16-06-2023(శుక్రవారం) : ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ -1

17-06-2023(శనివారం) : కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్ -1

19-06-2023 (సోమవారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1 , మ్యాథ్స్ పేపర్-1(BiPC విద్యార్థులకు)

20-06-2023(మంగళవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1

ఇంటర్ సెకండియ్ సప్లిమెంటరీ షెడ్యూల్ ఇలా( మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు)

12-06-2023(సోమవారం) : సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II

13-06-2023(మంగళవారం) : ఇంగ్లీష్ పేపర్-II

14-06-2023(బుధవారం): మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II

15-06-2023(గురువారం): మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ-II

16-06-2023(శుక్రవారం) : ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ -II

17-06-2023(శనివారం) : కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ -II

19-06-2023 (సోమవారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -II , మ్యాథ్స్ పేపర్-II(BiPC విద్యార్థులకు)

20-06-2023(మంగళవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-II, జాగ్రఫీ పేపర్-II

21-06-2023 (బుధవారం ) ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 వరకు ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పేపర్

22-06-2023 (గురువారం) ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు ఎన్విరాన్మెంటల్ ఎక్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.

తెలంగాణవ్యాప్తంగా 4,33,082లక్షల మంది విద్యార్ధులు మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైతే వారిలో 2,72,208 మంది పాస్ అయ్యారు. ఫస్టియర్‌లో 63.85 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 3,80,920మంది పరీక్షలకు హాజరైతే 2,56,241మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లో 65.26 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణులు అయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు పరీక్షల ఫీజీలు చెల్లించారు.

IPL_Entry_Point