TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ హాల్ టికెట్లు విడుద‌ల‌ - డౌన్లోడ్ లింక్ ఇదే-ts inter supplementary exam hall tickets 2024 released at https tsbie cgg gov in direct download link are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ హాల్ టికెట్లు విడుద‌ల‌ - డౌన్లోడ్ లింక్ ఇదే

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ హాల్ టికెట్లు విడుద‌ల‌ - డౌన్లోడ్ లింక్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
May 17, 2024 05:17 PM IST

TS Inter Supplementary Hall Tickets 2024 Updates: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. బోర్డు అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల 2024 హాల్ టికెట్లు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల 2024 హాల్ టికెట్లు

TS Inter Supplementary Hall Tickets 2024 : తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే విద్యార్థుల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.  https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. 

TS Inter Supplementary Hall Tickets Download - డౌన్లోడ్ లింక్ ఇదే

  • ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలనే విద్యార్థులు https://tsbie.cgg.gov.in/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి. 
  • ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ  మే/జూన్ - 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
  • రోల్ నంబర్ లేదా మునుపటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TS Inter Supply Exam schedule 2024 - ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్…

  • 24-05-2024 : Part II - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
  • 25-05-2024 : Part I -ఇంగ్లిష్ పేపర్-1
  • 28-05-2024 : Part -III -గణితం పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
  • 29-05-2024 : గణితం పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
  • 30-05-2024 : ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
  • 31-05-2024 : కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
  • 01-06-2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1(For BiPC Students)
  • 03-06-2024 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1

TS Inter Supply Exam schedule 2024 - ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్…

  • 24-05-2024 : Part II - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
  • 25-05-2024 : Part I -ఇంగ్లిష్ పేపర్-2
  • 28-05-2024 : Part -III -గణితం పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
  • 29-05-2024 : గణితం పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
  • 30-05-2024 : ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
  • 31-05-2024 : కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
  • 01-06-2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2(For BiPC Students)
  • 03-06-2024 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2

ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరగనున్నాయి. ఇక సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహించనున్నారు. 

ముందుగా మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావించింది. కానీ ఈ తేదీలను మే 24 నుంచి జూన్ 3 వరకు మార్చింది. మే 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కారణంగా షెడ్యూల్ లో పలు మార్పులు చేసింది. దీంతో జూన్ 3వ రకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.

 

 

Whats_app_banner