TS Inter Results 2024 : ఈ నెల 24న టీఎస్ ఇంటర్ ఫలితాలు, బోర్డు అధికారిక ప్రకటన-ts inter first second year results 2024 date announced april 24th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Results 2024 : ఈ నెల 24న టీఎస్ ఇంటర్ ఫలితాలు, బోర్డు అధికారిక ప్రకటన

TS Inter Results 2024 : ఈ నెల 24న టీఎస్ ఇంటర్ ఫలితాలు, బోర్డు అధికారిక ప్రకటన

Bandaru Satyaprasad HT Telugu
Apr 22, 2024 05:52 PM IST

TS Inter Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులు ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఈ నెల 24న టీఎస్ ఇంటర్ ఫలితాలు
ఈ నెల 24న టీఎస్ ఇంటర్ ఫలితాలు

TS Inter Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల(TS Inter Results 2024)పై అధికారి ప్రకటన వచ్చింది. ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను(TS Inter Results 2024 Date) ఒకేసారి విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ లో విద్యాశాఖ సెక్రటరీ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. హెచ్.టి.తెలుగులో ఇంటర్ ఫలితాలు సులభంగా చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ లింక్ https://telugu.hindustantimes.com/telangana-board-result లో ఇంటర్ ఫలితాలు పొందవచ్చు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు

ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు(TS Inter Exams 2024) నిర్వహించారు. ఈ పరీక్షలకు ఈసారి 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టారు. ఏప్రిల్ 10 వతేదీన మూల్యాంకనం(Spot Valuation) పూర్తి చేశారు. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలన చేసి మార్కులు కంప్యూటీకరణ చేశారు. గతేడాది మే 9న ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఈసారి ఎన్నికల కారణంగా 15 రోజుల ముందుగానే ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటిస్తున్నారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/home.do లో విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

హెచ్.టి.తెలుగులో ఇంటర్ ఫలితాలు(TS Inter Results Download)

తెలంగాణ ఇంటర్ పరీక్షల(TS Inter Results 2024) ఫలితాలను హెచ్.టి. తెలుగులో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదల చేసిన క్షణాల వ్యవధిలోనే https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై విద్యార్థులు ఫలితాలను సింగిల్ క్లిక్ లో చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ కింది మీ ఫలితాల లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్‌ ను ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ నొక్కితే మీ మార్కుల జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మార్కుల మెమో కాపీని పొందవచ్చు.

టీఎస్ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result-2024

టీఎస్ ఇంటర్ సెకండియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result-2024

టీఎస్ ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result-2024

టీఎస్ ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-voc-result-2024

తెలంగాణ ఇంటర్ ఫలితాలను బుధవారం ప్రకటించనున్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు వెలువడిన తర్వాత, విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లో తనిఖీ చేయవచ్చు.