TS ICET Results 2023 : అలర్ట్... జూన్ 20న తెలంగాణ 'ఐసెట్' ఫలితాలు
TS ICET 2023 Updates: టీఎస్ ఐసెట్ - 2023 అభ్యర్థులకు అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఫలితాలు ప్రకటించే తేదీని ప్రకటించారు.
TS ICET Results Updates 2023: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ - 2023 పరీక్షకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ప్రాథమిక కీతో పాటు ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు అధికారులు. ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన టీఎస్ ఐసెట్ - 2023 ఫలితాలను జూన్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. జూన్ 5వ తేదీన ప్రాథమిక కీ ని అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో పరీక్షలను నిర్వహించగా 70,900 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీపై అభ్యంతరాలను జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలని కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ స్పష్టం చేశారు. ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులు జూన్ 5వ తేదీ నుంచి క్వశ్చన్ పేపర్లు, రెస్సాన్స్ షీట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను convener.icet@tsche.ac.in మెయిల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇక క్వశ్చన్ పేర్, రెస్సాన్స్ షీట్లను icet.tsche.ac.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఫలితాలను కూడా ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
పీహెచ్డీ ప్రవేశాల ప్రకటన..
తాజాగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ నుంచి పీజీ, యూజీ, పీహెచ్డీ ప్రవేశాల ప్రకటన విడుదలైంది. పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు ముఖ్య తేదీలతో పాటు ప్రవేశాల నిబంధనలను పేర్కొంది.శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీసైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిషం కోర్సుల్లో ఎంఫిల్ తో పాటు పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనుంది. 2019 - 20, 2020 - 2021 విద్యాసంవత్సరానికి గాను సీట్లు కేటాయిస్తారు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా... జూన్ 16వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆలస్య రుసుముతో జూన్ 30వ తేదీ లోగా అప్లయ్ చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. మరిన్ని వివరాల కోసం www.pstucet.org వెబ్‌సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.