TS ICET Counselling 2022 : ఐసెట్ కౌన్సెలింగ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
TS ICET 2022 ఫలితాలు చాలా రోజుల కిందట వచ్చాయి. కౌన్సెలింగ్ తేదీలు సెప్టెంబర్ 27 నుంచి అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు tsicet.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
IS ICET Counselling 2022 : తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) సెప్టెంబర్ 27న తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS ICET) 2022 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచుంది. ఆ తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం tsicet.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
TSICET-2022 అడ్మిషన్ల కౌన్సెలింగ్ వివరాలు 27-09-2022న tsicet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో MBA, MCA కోర్సులకు విద్యార్థులను చేర్చుకోవడానికి TSCHE తరఫున ఐసెట్ పరీక్షను కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ప్రవేశ పరీక్ష జులై 27, 28, 2022 తేదీలలో జరిగింది. తాత్కాలిక సమాధానాల కీ ఆగస్టు 4, 2022న చేశారు. ఫలితాలు ఆగస్టు 27న ప్రకటించారు.
TS ICET 2022 కౌన్సెలింగ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి
TS ICET కౌన్సెలింగ్ వెబ్‌సైట్, tsicet.nic.inకి వెళ్లండి.
ప్రాసెసింగ్ ఫీజు చెల్లించండి.
రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసి లాగిన్ చేయండి.
అవసరమైన వివరాలను నింపాలి.
బుక్ స్లాట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎంచుకోవాలి.
ఎంపిక నమోదు కోసం లాగిన్ చేయాలి.
సేవ్ చేసిన ఎంపిక ప్రక్రియను ప్రింట్ తీసుకుని.. లాగ్ అవుట్ చేయండి.
TS ICET Exam 2022 : రాష్ట్రవ్యాప్తంగా జులై 28న ఐసెట్ పరీక్షను నిర్వహించారు. తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్‌లో 4 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 76,160 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడత పరీక్షకు 90.93 శాతం, రెండో విడత పరీక్షకు 91.43 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.