TS ICET Seats : ఐసెట్ మొదటి దశలో 23,001 సీట్ల కేటాయింపు.. ఇంకా ఎన్ని ఉన్నాయంటే-ts icet 23001 seats allotted in first phase here is details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Icet 23001 Seats Allotted In First Phase Here Is Details

TS ICET Seats : ఐసెట్ మొదటి దశలో 23,001 సీట్ల కేటాయింపు.. ఇంకా ఎన్ని ఉన్నాయంటే

HT Telugu Desk HT Telugu
Oct 18, 2022 10:05 PM IST

TS ICET Seats Allotment : టీఎస్ ఐసెట్ మెుదటి విడత సీట్ల కేటాయింపు జరిగింది. ఎంబీఏలో 86.44 శాతం, ఎంసీఏలో 99.82 శాతం సీట్లు భర్తీ చేశారు.

టీఎస్ ఐసెట్ సీట్ల కేటాయింపు
టీఎస్ ఐసెట్ సీట్ల కేటాయింపు

ఎంబీఏ(MBA), ఎంసీఏ(MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET) 2022 తొలి దశ వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు మంగళవారం సీట్లు కేటాయించారు. టీఎస్ ఐసెట్ మెుదటి విడత సీట్ల కేటాయింపు జరిగింది. ఎంబీఏలో 20,336 సీట్లు భర్తీ అయ్యాయి. 3,189 సీట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. ఎంసీఏలో 2,673 సీట్లు భర్తీ చేశారు. కేవలం 3 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు.. 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్(Self Reporting) చేయాలి. ఈ నెల 28 నుంచి 31 వరకు సర్టిఫికెట్లను కాలేజీల్లో సమర్పించాలని ఐసెట్ అధికారులు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

TS ICET 2022లో 61,613 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. 31,955 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్‌(Certification Verification)కు హాజరయ్యారు. 31,258 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్‌లను వినియోగించుకున్నారు. 261 కళాశాలల్లోని 26,201 సీట్లలో 23,001 మందికి సీట్లు కేటాయించారు. రాష్ట్రంలోని 252 ఎంబీఏ కాలేజీల్లో మొత్తం 23,525 సీట్లు అందుబాటులో ఉండగా 20,336 సీట్లు కేటాయించారు.

ఎంసీఏ అడ్మిషన్లకు సంబంధించి 43 కాలేజీల్లో 2,676 సీట్లకు గాను 99.89 శాతం సీట్లు కేటాయించారు. అభ్యర్థులు tsicet.nic.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో స్వీయ-రిపోర్ట్ చేయాలి. అక్టోబర్ 21 లేదా అంతకంటే ముందు ట్యూషన్ ఫీజు చెల్లించాలి. లేదంటే.. తాత్కాలిక సీటు కేటాయింపు రద్దు చేస్తారు.

ఐసెట్‌ ఫలితాలు(ICET Results) వచ్చి చాలా రోజులైంది. కానీ డిగ్రీ ఫలితాలు వెలువడకపోవడం, ఎంసెట్, ఈసెట్‌ కౌన్సెలింగ్‌లు కారణంగా జాప్యం జరిగింది. ఐసెట్ కౌన్సెలింగ్(ICET Counselling) పూర్తయిన వెంటనే.. అక్టోబరు 28న స్పాట్‌ ప్రవేశాల మార్గదర్శకాలు ఇస్తారు. మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌ కు వెళ్లి చూసుకోవచ్చు.

TS ICET 2022 కౌన్సెలింగ్ దరఖాస్తు చేసుకునే విధానం

TS ICET కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌ icet.tsche.ac.inకి వెళ్లాలి.

ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసి లాగిన్ చేయాలి.

అవసరమైన వివరాలను నింపాలి.

బుక్ స్లాట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ ఎంచుకోవాలి.

ఎంపిక నమోదు కోసం లాగిన్ చేయాలి.

సేవ్ చేసి ప్రింట్ తీసుకుని లాగ్ అవుట్ చేయాలి.

WhatsApp channel