TS ICET 2024 Key :తెలంగాణ ఐసెట్ 'కీ' విడుదల - అందుబాటులోకి 'రెస్పాన్స్ షీట్లు', లింక్ ఇదే
Telangana ICET 2024 Key Updates: తెలంగాణ ఐసెట్ - 2024 ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిిని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Telangana ICET 2024 Key Updates: తెలంగాణ ఐసెట్ - 2024కి సంబంధించి మరో అప్డేట్ అందింది. ఇటీవలే పరీక్ష పూర్తికాగా… తాజాగా ప్రిలిమినరీ కీ తో పాటు రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు… https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పొందవచ్చు. ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూన్ 09వ తేదీలోపు పంపాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
How to Download TS ICET 2024 Key : ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే TG ICET 2024 Preliminary Question Papers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ తేదీలతో పాటు సెషన్ల వారీగా వివరాలు కనిపిస్తాయి. మీరు ఏ సెషన్ లో పరీక్ష రాశారో ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీకు ప్రిలిమినరీ కీ ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
TS ICET 2024 Response Sheets : టీఎస్ ఐసెట్ రెస్పాన్స్ షీట్లు ఇలా పొందండి
- తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే Download Response Sheets ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ Registration Number, ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- మీ రెస్పాన్స్ షీట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే ఐసెట్ వెబ్ సైట్ లోకి వెళ్లి OBJECTIONS ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ ICET Hall Ticket Number , రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత మీ అభ్యంతరాలను నిర్ణయించిన ఫార్మాట్ లో పంపాలి.
- అభ్యంతరాలు పంపేందుకు https://icet.tsche.ac.in/TSICET/TSICET_KEYOBJECTIONS.aspx లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవచ్చు.
- ఐసెట్ రెస్పాన్స్ షీట్లు పొందేందుకు https://icet.tsche.ac.in/TSICET/TSICET_ResponseSheets.aspx లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్) పరీక్షలను ఈ ఏడాది కాకతీయ వర్శిటీ నిర్వహిస్తోంది. తెలంగాణ ఐసెట్ పరీక్షలు జూన్ 5 నుంచి 6వ తేదీ వరకు పలు సెషన్లల్లో జరిగాయి.