TS ICET-2023 Results: అలర్ట్... రేపు టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల - ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి-ts icet 2023 results will be announced on june 29 check at icettscheacin ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Icet-2023 Results Will Be Announced On June 29 Check At Icet.tsche.ac.in

TS ICET-2023 Results: అలర్ట్... రేపు టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల - ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 28, 2023 05:19 PM IST

TS ICET-2023 Results Updates: టీఎస్ ఐసెట్ - 2023 అభ్యర్థులకు అలర్ట్ ఇచ్చారు అధికారులు. జూన్ 29వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఐసెట్ - 2023 ఫలితాలు
తెలంగాణ ఐసెట్ - 2023 ఫలితాలు

TS ICET Results Updates 2023: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వహించిన ఐసెట్ - 2023 పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఫైనల్ కీతో పాటు ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు అధికారులు. గత నెల 26, 27 తేదీల్లో నిర్వ‌హించిన టీఎస్ ఐసెట్ - 2023 ఫలితాలను జూన్ 29వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ ఫలితాలను చెక్ చేసుకోవాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

ఇలా చెక్ చేసుకోండి…

అభ్యర్థులు మొదటగా https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

ఐసెట్ ఫలితాలు - 2023 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.

అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.

ఇక మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో పరీక్షలను నిర్వహించగా 70,900 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథ‌మిక కీపై అభ్యంత‌రాల‌ను జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌కు ఆన్‌లైన్ ద్వారా స్వీకరించారు. జూన్ 5వ తేదీ నుంచి క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు, రెస్సాన్స్ షీట్ల‌ను వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచారు.రేపు ఫైనల్ కీతో పాటు తుది ఫలితాలను ప్రకటించనున్నారు.

AP ICET Results 2023: మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్‌ - 2023 ఫలితాలు ఇప్పటికే వచ్చేశాయి. ఈ ఏడాదికి సంబంధించిన ప్రవేశ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షకు గాను... 44 వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

- అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

- Results అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

- Registration Number , హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.

- View Results ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.

- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ పొందవచ్చు.

- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంక కీలకం. భవిష్యత్ అవసరాల దృష్ట్యా జాగ్రత్తగా ఉంచుకోవాలి.

రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 24న ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు. తాజా ఫలితాల్లో జగదీశ్‌కుమార్‌రెడ్డి (రేణిగుంట) టాపర్ గా నిలవగా… సికింద్రాబాద్ కు చెందిన సాయివెంకట కార్తీక్ స్టేట్ సెకండ్ టాపర్ గా ఉన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం