TS ICET 2022 : టీఎస్ ఐసెట్.. ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయంటే?-ts icet 2022 here is details of seats available for admissions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Icet 2022 : టీఎస్ ఐసెట్.. ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయంటే?

TS ICET 2022 : టీఎస్ ఐసెట్.. ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయంటే?

HT Telugu Desk HT Telugu
Oct 09, 2022 07:25 PM IST

TSICET 2022 Counselling : తెలంగాణ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET) 2022 ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ జరుగుతోంది. అక్టోబర్ 18న సీట్ల కేటాయింపు నిర్వహిస్తారు.

<p>టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్</p>
టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్

టీఎస్ ఐసెట్ 2022(TS ICET 2022) కౌన్సెలింగ్ జరుగుతోంది. మొత్తం 20,481 MBA కన్వీనర్ కోటా సీట్లకు నిర్వహించనున్నారు. ఈ సీట్లలో 18,963 సీట్లు 209 ప్రైవేట్ కాలేజీల్లో, 1,518 సీట్లు రాష్ట్రంలోని 22 యూనివర్సిటీ/యూనివర్సిటీ కాన్‌స్టిట్యూయెంట్ కాలేజీల్లో ఉన్నాయి. ఎంసీఏ కోర్సుకు సంబంధించి 40 కాలేజీల్లో 2370 కన్వీనర్ సీట్లు ఉన్నాయి.

TS ICET 2022 ద్వారా MBA, MCA కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకునే అభ్యర్థులు అక్టోబర్ 12న లేదా అంతకు ముందు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్‌ను బుక్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్(Certificate Verification) అక్టోబర్ 10 నుండి 13 వరకు ఉంటుంది. అయితే వెబ్ ఆప్షన్‌(Web Option)లను అక్టోబర్ 10 నుండి 15 వరకు ఉపయోగించుకోవచ్చు.

ఐసెట్‌ ఫలితాలు(ICET Results) వచ్చి చాలా రోజులైంది. కానీ డిగ్రీ ఫలితాలు వెలువడకపోవడం, ఎంసెట్, ఈసెట్‌ కౌన్సెలింగ్‌లు కారణంగా జాప్యం జరిగింది. ఐసెట్ కౌన్సెలింగ్(ICET Counselling) పూర్తయిన వెంటనే.. అక్టోబరు 28న స్పాట్‌ ప్రవేశాల మార్గదర్శకాలు ఇస్తారు. మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌ కు వెళ్లి చూసుకోవచ్చు.

మొదటి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

అక్టోబరు 8 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం నింపి ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. అక్టోబరు 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. అక్టోబరు 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. అక్టోబరు 18న సీట్ల కేటాయింపు ఉంటుంది.

చివరి విడత కౌన్సెలింగ్

అక్టోబరు 23వ తేదీన ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. అక్టోబరు 24వ తేదీ ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. అక్టోబరు 23 నుంచి 25 వరకు వెబ్‌ఆప్షన్లు ఉంటాయి. అక్టోబరు 28వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది.

TS ICET 2022 కౌన్సెలింగ్ దరఖాస్తు చేసుకునే విధానం

TS ICET కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌ icet.tsche.ac.inకి వెళ్లాలి.

ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసి లాగిన్ చేయాలి.

అవసరమైన వివరాలను నింపాలి.

బుక్ స్లాట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ ఎంచుకోవాలి.

ఎంపిక నమోదు కోసం లాగిన్ చేయాలి.

సేవ్ చేసి ప్రింట్ తీసుకుని లాగ్ అవుట్ చేయాలి.

Whats_app_banner

సంబంధిత కథనం