TS ICET 2022 Counselling Schedule : ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే-ts icet 2022 counselling schedule released check here dates and other details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Icet 2022 Counselling Schedule Released Check Here Dates And Other Details

TS ICET 2022 Counselling Schedule : ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే

HT Telugu Desk HT Telugu
Sep 19, 2022 08:13 PM IST

TS ICET 2022 Counselling Schedule : టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండు విడతల్లో కౌన్సెలింగ్ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు వివరాలు వెలువడ్డాయి.

టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్
టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్(TS ICET 2022 Counselling) విడుదలైంది. రెండు విడతల్లో కౌన్సెలింగ్ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. అక్టోబరు 8 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. వివిధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్ సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్ విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు

TS ICET 2022 Counselling Process : టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ రెండు విడతల్లో నిర్వహిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 8 నుంచి ప్రారంభం అవుతుంది. రెండో విడత అక్డోబర్ 23న ప్రారంభిస్తారు. అక్టోబరు 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 8 నుంచి 12 వరకు స్లాట్‌బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

TS ICET 2022 First Phase Counselling Schedule Dates : అక్టోబరు10 నుంచి 15 వరకు కోర్సులు, కాలేజీల వెబ్‌ ఆప్షన్లను అభ్యర్థులు నమోదు చేయాల్సి ఉంటుంది. అక్టోబరు 18న ఎంబీఏ, ఎంసీఏ మెుదటి విడత సీట్ల కేటాయిస్తారు. అక్టోబరు 18 నుంచి 21 వరకు సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలి. తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 23న ప్రారంభం అవుతుంది. అక్టోబరు 28న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేస్తామని నవీన్ మిత్తల్ వెల్లడించారు.

TS ICET Exam 2022 : రాష్ట్రవ్యాప్తంగా జులై 28న‌ ఐసెట్ పరీక్షను నిర్వహించారు. తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్‌లో 4 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 76,160 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడత పరీక్షకు 90.93 శాతం, రెండో విడత పరీక్షకు 91.43 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇలా చెక్ చేసుకోండి

అభ్యర్థులు మొదటగా icet.tsche.ac.in వెబ్ సైట్ ను సందర్శించాలి.

ఐసెట్ రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

వివరాలు ఎంట్రీ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ ర్యాంక్ కార్డు పొందవచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఐసెట్ ర్యాంక్ కార్డు డౌన్ లోడ్(ICET Rank Card Download) చేసుకోవచ్చు

WhatsApp channel