Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్-ts high court gives conditional permission to bandi sanjay ps yatra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts High Court Gives Conditional Permission To Bandi Sanjay Ps Yatra

Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్

HT Telugu Desk HT Telugu
Nov 28, 2022 01:59 PM IST

Bandi Sanjay తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. భైంసా నుంచి యాత్రను చేపడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు సంజయ్ యాత్రను అడ్డుకోవడంతో ఆ‍యన హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.

బండి సంజయ్ యాత్రకు హైకోర్టు అనుమతి
బండి సంజయ్ యాత్రకు హైకోర్టు అనుమతి (HT_PRINT)

Bandi Sanjay తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. బీజేపీ నాయకులు దాకలు చేసిన అత్యవసర పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం బండి సంజయ్ చేపట్టే యాత్రను యథావిధిగా కొనసాగించేందుకు అనుమతించింది. అదే సమయంలో యాత్ర నిర్వహణపై విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. భైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలో బహిరంగ సభ నిర్వహించుకోవాలని సూచించింది. బైంసా పట్టణంలోకి పాదయాత్ర వెళ్లకూడదని స్పష్టం చేసింది.

ఉత్కంఠ రేపిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి. యాత్రను కొనసాగించేందుకు హైకోర్టుకు సమ్మతి తెలిపింది. భైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలో యాత్రను ప్రారంభించి పట్టణంలోకి రాకుండా బయట నుంచి యాత్రను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.

భైంసాలో పాదయాత్ర చేపడితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం భైంసా నుంచి యాత్ర ప్రారంబించుకోవచ్చని యాత్రలో 3వేల మందికి మించిన జనం ఉండకూడదని, యాత్ర జరిగే సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, ఎవరు ఆయుధాలు ధరించకూడదని, సభ స్థలం ఎంత దూరంలో ఉండాలో పోలీసులు నిర్ణయిస్తారని ఆదేశించారు.

బీజేపీ నిర్వహించే సభా స్థలం భైంసా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరం ఉందో లేదో నిర్ధారించాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. వై జంక్షన్‌ ప్రాంతం, భైంసా పట్టణానికి అరకిలోమీటరు దూరంలో మాత్రమే ఉందని పోలీసులు అభ్యంతరం తెలపడంతో దూరాన్ని ఖచ్చితంగా నిర్దారించాలని హైకోర్టు సూచించింది. బండి సంజయ్ తరపున అడ్వకేట్ రామచంద్రరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ బండి సంజయ్ యాత్రపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. గతంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని, హత్య కూడా జరిగిందని, శాంతి భద్రతల కోణంలో చూస్తే యాత్రకు అనుమతివ్వడం సరికాదని వాదించారు.

మరోవైపు బీజేపీ తరపున రామచంద్రరావు వాదనలు వినిపించారు. డిసెంబర్ 6 సహా గతంలో అనేక కార్యక్రమాలు జరిగాయని, ఎక్కడా మత కల్లోలాలు జరగలేదన్నారు. బండి సంజయ్ యాత్ర , ఛార్మినార్ ప్రాంతంలోనే కొనసాగిందని, భైంసాలో మాత్రమే ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెబుతోందని బీజేపీ తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. బైంసాకు పట్టణానికి దూరంగా సమావేశాన్ని నిర్వహిస్తామని చెబుతున్నా ఎందుకు అడ్డు పడుతున్నారని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు మంజూరు చేసింది.

WhatsApp channel