TS Health Dept Jobs: వైద్యారోగ్య శాఖ నుంచి ఉద్యోగ ప్రకటన.. మహిళలకు మంచి ఛాన్స్..-ts health department issued radiographer jobs notification 2023 check here full details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Health Department Issued Radiographer Jobs Notification 2023 Check Here Full Details

TS Health Dept Jobs: వైద్యారోగ్య శాఖ నుంచి ఉద్యోగ ప్రకటన.. మహిళలకు మంచి ఛాన్స్..

HT Telugu Desk HT Telugu
Mar 09, 2023 05:25 PM IST

TS Govt Jobs in Telangana: నిరుద్యోగులకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. హైదరాబాద్ పరిధిలోని పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (chfw.telangana.gov.in)

Radiographer Jobs in Hyderabad: తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్లు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే కీలకమైన నోటిఫికేషన్లు రాగా... పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ అవుతున్నాయి. తాజాగా వైద్యారోగ్యశాఖ నుంచి మరో ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా... మొత్తం 11 రేడియోగ్రాఫర్ ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. అయితే ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే అర్హులు అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ నియామకాలను చేపట్టునున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు

ట్రెండింగ్ వార్తలు

ముఖ్య వివరాలు:

పోస్టుల పేరు - రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు - 11

అర్హతలు - డిప్లొమా/బీఎస్సీ (రేడియోగ్రఫి)/DMIT (డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ) విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు - 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.(కేటగిరీల వారీగా మినహాయింపులు ఇచ్చారు)

జీతం - నెలకు రూ.30 వేల వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్ విధానంలో సమర్పించాలి

దరఖాస్తులకు తుది గడువు - మార్చి 9, 2023

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://chfw.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అకాడమిక్స్ లో మెరిట్ ఆధారంగా తుది జాబితా వెల్లడిస్తారు. ప్రత్యేకంగా ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.

ఇలా అప్లయ్ చేసుకోండి..

అభ్యర్థులు మొదటగా.. https://chfw.telangana.gov.in/home.do లింక్ పై క్లిక్ చేయాలి.

Online Application Form Visit Link అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి, ఓ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం