Medical colleges: రాష్ట్రంలో కొత్తగా 8 వైద్య కళాశాలలు-ts govt sanctions rs 1479 cr to establish 8 more medical colleges in state ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Govt Sanctions <Span Class='webrupee'>₹</span>1479 Cr To Establish 8 More Medical Colleges In State

Medical colleges: రాష్ట్రంలో కొత్తగా 8 వైద్య కళాశాలలు

Mahendra Maheshwaram HT Telugu
Aug 07, 2022 10:00 AM IST

తెలంగాణలో కొత్తగా 8 వైద్య కళాశాలల ఏర్పాటుకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఒక్కో కళాశాలలో 100 చొప్పున మొత్తం 800 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణలో మెడికల్ కాలేజీలు
తెలంగాణలో మెడికల్ కాలేజీలు

medical colleges in telangana: మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో 2023-24 ఏడాదికి కొత్తగా 8 వైద్య కళాశాలల ఏర్పాటుకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఒక్కో కళాశాలలో 100 చొప్పున మొత్తం 800 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వైద్య కళాశాలల ఏర్పాటు, అనుబంధ ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్‌కు రూ.1,479 కోట్లు ఖర్చు చేయనుంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ జిల్లాలకే....

కామారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, భూపాలపల్లి, ఆసిఫాబాజ్, జనగామ, కరీంనగర్ జిల్లాల్లో ఈ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఆయా జిల్లాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు వైద్య విద్య సంచాలకులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ప్రతిపాదనల్ని పరిశీలించిన సర్కార్‌ కళాశాలల ఏర్పాటుకు అనుమతించింది. అవసరమైన భవనాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, పరికరాలు, సామాగ్రి సమీకరణ బాధ్యతను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి అప్పగించింది. మరోవైపు నాగర్‌ కర్నూల్‌లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు 2022-23 ఏడాదికి 150 ఎంబీబీఎస్‌ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) కళాశాల ప్రిన్సిపల్‌కు ఎల్‌ఓఐ జారీ చేసింది.

సీఎంకు మంత్రులు కృతజ్ఞతలు...

వైద్య కాలేజీలు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు... పలువురు మంత్రులు ప్రగతి భవన్ కలిశారు. ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు. వీరితో ఆయా జిల్లాల పరిధిలో ఉన్న ఎమ్మెలేలు కూడా సీఎంను కలిశారు.

జగిత్యాలలో కొత్తగా నెలకొల్పిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 150 ఎంబీబీఎస్ సీట్లను జూన్ మాసంలో మంజూరు చేసింది జాతీయ వైద్య కమిషన్. రాష్ట్ర ప్రభుత్వం 2022-23 వైద్య విద్య సంవత్సరంలో కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించడానికి నిర్ణయించిన విషయం తెలిసిందే. జగిత్యాల సహా సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలలో వైద్య కళాశాలల నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఈ 8 కళాశాలల్లో తనిఖీల ప్రక్రియ కూడా పూర్తి అయింది.

IPL_Entry_Point