TS Govt: దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ-ts govt go issued for disabled elderly and transgender welfare department ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Govt: దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ

TS Govt: దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ

HT Telugu Desk HT Telugu

new welfare department in telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. స్త్రీ, శిశు సంక్షేమశాఖలో భాగంగా ఉన్నదివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమశాఖ విభాగాన్ని ప్రత్యేక మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

దివ్యాంగులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ

Disabled, Elderly and Transgender Welfare Department in Telangana: దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమం విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం(డిసెంబరు 3) సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. స్త్రీ, శిశు సంక్షేమశాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమశాఖ విభాగాన్ని మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. కొత్త మంత్రిత్వశాఖపై తెలంగాణ సర్కార్ శనివారం జీవో నెంబర్ 34ను విడుదల చేయనుంది. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకశాఖ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లకు సంక్షేమం, ఇతర సేవలు అందించేందుకు వీలుగా జిల్లా స్థాయిలోనూ మహిళ, శిశు సంక్షేమ శాఖ నుంచి వీటిని వేరుచేశారు. వీటికి జిల్లా సంక్షేమ అధికారిని నియమించనున్నారు. మహిళ శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ శాఖల మధ్య ప్రతి జిల్లాకు శాఖాపరమైన ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంపై వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు.

ఆయా వర్గాల సంక్షేైమానికి తెలంగాణ సర్కార్ కట్టుబడి ఉందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. వికలాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం 21 మంది సభ్యులతో సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.