Telangana Govt : డిగ్రీ కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సు
విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సును ప్రవేశపెట్టనుంది.
ఇప్పటి వరకూ.. ఇంజీనిరింగ్ కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్(ఏఐ అండ్ ఎంఎల్) కోర్సులను చూసి ఉంటారు. కానీ ఇకపై.. డిగ్రీ కాలేజీల్లోనూ వీటిని ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది నుంచి ఇది అమల్లోకి రానుంది. అయితే ఈ సంవత్సరం రాష్ట్రంలో బీఎస్సీలో ఏఐ అండ్ ఎంఎల్ కోర్సును అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం. కళాశాల విద్యాశాఖ పరిధిలో మొత్తం 129 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అందులో 11 కళాశాలలకు యూజీసీ నుంచి స్వయంప్రతిపత్తి హోదా ఉన్నది.
ఆ కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సును ప్రవేశపెట్టాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మరోవైపు బీబీఏ లాజిస్టిక్, బీబీఏ, రిటైలింగ్, బీఎస్సీ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోర్సులను కూడా అందుబాటులోకి వస్తాయి. 2020లో బీఎస్సీ డేటా సైన్స్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కిందటి ఏడాది.. బీఏ ఆనర్స్‌ను ఆరు కళాశాలల్లో ప్రవేశపెట్టారు. ఈసారి సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని కొన్ని రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు కూడా అందుబాటులోకి వస్తుంది.
ఇప్పటివరకు, AI, ML కోర్సులను రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో ఇంజనీరింగ్ కోర్సుగా అందిస్తున్నాయి. గ్రాడ్యుయేట్లకు ఈ రంగంలో పుష్కలమైన కెరీర్ అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సులకు బయటక భారీ డిమాండ్ ఉంది. అందుకోసమే.. 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో బీఎస్సీలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సులు ఇవ్వాలని నిర్ణయించారు.
కొత్త కోర్సులో 60 సీట్లు ఉంటాయి. బుధవారం నోటిఫికేషన్ జారీ చేసిన దోస్త్ ద్వారా ప్రవేశాలు జరుగుతాయి. కోర్సు పాఠ్యాంశాలు స్వయంప్రతిపత్తి హోదాను కలిగి ఉన్నందున వాటి సంబంధిత బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లోని కళాశాలలతో రూపొందిస్తారు.
BA (ఆనర్స్) చరిత్ర కోర్సు
గత సంవత్సరం BA (ఆనర్స్) ఎకనామిక్స్, BA (ఆనర్స్) పొలిటికల్ సైన్స్ కోర్సులను విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత గవర్నమెంట్ సిటీ కాలేజ్ ఈ విద్యా సంవత్సరంలో మరో ఆనర్స్ కోర్సును అంటే BA (ఆనర్స్) హిస్టరీని కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ కొత్త కోర్సులో ప్రవేశాలు దోస్త్ ద్వారా కూడా జరుగుతాయి.
సంబంధిత కథనం
టాపిక్