TS EAMCET Results 2023: ఇవాళే 'ఎంసెట్' ఫలితాలు - HT తెలుగులో సింపుల్​గా ఇలా చెక్ చేసుకోండి-ts eamcet results 2023 candidates can check their results at eamcettscheacin ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Ts Eamcet Results 2023 Candidates Can Check Their Results At Eamcet.tsche.ac.in

TS EAMCET Results 2023: ఇవాళే 'ఎంసెట్' ఫలితాలు - HT తెలుగులో సింపుల్​గా ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు - 2023
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు - 2023

TS EAMCET Results 2023 updates: ఇవాళ తెలంగాణ ఎంసెట్ 2023 ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 9.30 గంటలకు మంత్రి సబితారెడ్డి విడుదల చేయనున్నారు. హెచ్ టీ తెలుగు సైట్ తో పాటు eamcet.tsche.ac.in వెబ్ సైట్ లో రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

TS EAMCET Results 2023: లక్షలాది మంది విద్యార్థుల ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 09.30 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్ లోని గోల్డెన్ జూబ్లీ హాల్ లో ఈ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఫలితాల విడుదల సమయంలోనే ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ద్వారా సింపుల్ గా తెలుసుకోవచ్చు. ఇక ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/ లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్(EAMCET) పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,20,683 దరఖాస్తులు రాగా, వీటిలో 3,01,789 మంది విద్యార్థలు పరీక్షలు రాశారు. వీరిలో తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,918 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేసుకోగా... వీరిలో 65,871 మంది మాత్రమే పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు ఇప్పటికే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

HT తెలుగులో ఇలా చెక్ చేసుకోండి..

విద్యార్థులు డైరెక్ట్‌గా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ https://telugu.hindustantimes.com/telangana/results లోకి వెళ్లాలి.

హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.

అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం.

ఎంసెట్ వెబ్ సైట్ లో ఇలా చూసుకోండి..

Step 1 : ముందుగా అభ్యర్థులు //https://eamcet.tsche.ac.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.

Step 2 : హోం పేజీలో ఎంసెట్ రిజల్ట్స్ 2023 సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3 : అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.

Step 4 : మీ రిజల్ట్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది. ఫలితాల కాపీని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోండి.