TS DOST 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - దోస్త్ ఫస్ట్ ఫేజ్‌ సీట్ల కేటాయింపు, నేటి నుంచే 2వ విడత రిజిస్ట్రేషన్లు-ts dost 2024 phase 1 seat allotment result out at dost cgg gov in check key dates are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Dost 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - దోస్త్ ఫస్ట్ ఫేజ్‌ సీట్ల కేటాయింపు, నేటి నుంచే 2వ విడత రిజిస్ట్రేషన్లు

TS DOST 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - దోస్త్ ఫస్ట్ ఫేజ్‌ సీట్ల కేటాయింపు, నేటి నుంచే 2వ విడత రిజిస్ట్రేషన్లు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 06, 2024 07:37 PM IST

TS DOST 2024 Phase 1 Seat Allotment : తెలంగాణ దోస్త్ 2024 మొదటి విడత సీట్లను కేటాయించారు. విద్యార్థుల వెబ్ ఆప్షన్ ఆధారంగా…. తొలి ఫేజ్ లో మొత్తం 76,290 మంది విద్యార్థుల‌కు సీట్లు దక్కాయి.

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు 2024
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు 2024

TS DOST 2024 Phase 1 seat allotment : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. దోస్త్ ఆన్ లైన్ ప్రక్రియలో భాగంగా…. ఇవాళ ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. విద్యార్థుల ఇచ్చిన వెబ్ ఆప్షన్ ఆధారంగా…. మొదటి దశలో మొత్తం 76,290 మంది విద్యార్థుల‌కు సీట్లు దక్కాయి.

సీట్లు దక్కించుకున్న విద్యార్థులు జూన్ 7ను కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 12వ తేదీ వరకు అవకాశం ఉంది. మరోవైపు రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. జూన్ 13 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంది.

రిజిస్ట్రేషన్ల తర్వాత జూన్ 14 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్‌ 18న తేదీన దోస్త్‌ రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. మూడో విడత ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు జూన్‌ 19 నుంచి 25 వరకు కొనసాగుతాయి.

TS DOST 2024 Phase 1 seat allotment result: ఇలా చెక్ చేసుకోండి

ఫస్ట్ ఫేజ్ లో సీట్లు దక్కించుకున్న విద్యార్థులు దోస్త్ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి….

విద్యార్థులు ముందుగా https://dost.cgg.gov.in/welcome.do వెబ్ సైట్ లోకి వెళ్లాలి,

  • TS DOST 2024 Phase 1 seat allotment result లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది.
  • ఏ కాలేజీ కేటాయించారో ఇక్కడ చూసుకోవచ్చు.
  • సీటు అలాట్ మెంట్ కాపీని కూడా పొందవచ్చు.

TS DOST Registration 2024 - దోస్త్ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి

  • డిగ్రీ ప్రవేశాల పొందే అర్హత ఉన్న విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ లోకి వెళ్లాలి.
  • ముదుగా Candidate Pre-Registrationపై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. ఫలితంగా aadhaar authentication ప్రక్రియ పూర్తి అవుతుంది.
  • ఫలితంగా మీ లాగిన్ పూర్తి అవుతుంది.
  • నిర్ణయించిన ఫీజును తప్పకుండా చెల్లించాలి.
  • ఫైనల్ గా మీ రిజిస్ట్రేషన్ దోస్త్ లో పూర్తి అవుతుంది.
  • జూన్ 13 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంది.
  • రిజిస్ట్రేషన్ల తర్వాత జూన్ 14 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
  • జూన్‌ 18న తేదీన దోస్త్‌ రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

చివరి విడత జూన్ 19వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. జూన్‌ 25 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. జూన్ 19 నుంచి 26 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్‌ 29వ తేదీన తుది విడుత సీట్లను కేటాయిస్తారు. జూలై 3వ తేదీలోపు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూలై 7వ తేదీ నుంచి డిగ్రీ తరగతులు తరగతులు ప్రారంభమవుతాయి.

మొత్తం 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనుంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. గత ఏడాది కూడా ఇదే మాదిరిగా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసింది. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి ఇతర అప్డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు.

Whats_app_banner